మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. ఇతర పార్టీల నాయకులతో పాటు, టీఆర్ఎస్ నేతలు సైతం ఆయనతో టచ్ లో ఉండటం చర్చనీయాంశంగా మారింది. నిన్న కరీంనగర్ జిల్లాకు చెందిన కొంతమంది నేతలు సైతం టీఆర్ఎస్ కు షాక్ ఇస్తూ ఈటల రాజేందర్ కు మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రి గంగుల కమలాకర్ ‘వెంట్రుక కూడా పీక లేవ్’ అని ఈటలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కరీంనగర్ జిల్లా వీణవంక మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు మ్యాకల ఎల్లారెడ్డి స్పందిస్తూ గంగులకు సీరియఎస్ వార్నింగ్ ఇచ్చారు. ఈటల రాజేందర్ కడిగిన ముత్యం అని.. బిడ్డా జాగ్రత్త అంటూ సవాల్ విసిరారు. అధికారం అడ్డం పెట్టుకొని ప్రభుత్వ పథకాలు ఆపితే.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
Must Read ;- కేసీఆర్ మార్కు వ్యూహం.. గంగుల ఎంట్రీతో ఈటల విలవిల