రీసెంట్ గా ‘వైల్డ్ డాగ్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన అక్కినేని నాగార్జున.. ఆ సినిమాతో మిశ్రమ ఫలితాల్ని అందుకున్నారు. అదే సినిమాకి ఓటీటీలో మాత్రం అత్యధిక ప్రేక్షకాదరణ దక్కింది. ఇప్పుడు నాగ్ తదుపరి రెండు సినిమాల మీద తన దృష్టినంతటినీ కేంద్రీకరించారు. అందులో ఒకటి ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సినిమా ఒకటైతే, మరొకటి ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాకి సీక్వెల్ అయిన ‘బంగార్రాజు’.
నిజానికి ప్రవీణ్ సత్తారు సినిమాను నాగ్ .. ఆపేశారని, ఇకపై ఆయన ‘వైల్డ్ డాగ్’ లాంటి ప్రయోగాల జోలికి వెళ్ళకూడదని నిర్ణయించుకోవడమే దానికి కారణమని..ఇలా రకరకాల రూమర్స్ వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సినిమాను ఆపలేదని, ఆల్రెడీ ఆ సినిమా షూటింగ్ ఒక షెడ్యూల్ ను కూడా కంప్లీట్ చేశారని తెలుస్తోంది. రెండో షెడ్యూల్ ను జూన్ నుంచి మొదలుపెడతారట.
ఇక ఈ సినిమాలో నాగార్జున రా ఆఫీసర్ గా నటిస్తున్నరని ఇదివరకే వార్తలొచ్చాయి. అలాగే.. కాజల్ అగర్వాల్ కూడా ఇందులో రా అధికారిగా నటిస్తోందట. అతి త్వరలోనే ఈ సినిమాకి టైటిల్ అనౌన్స్ మెంట్ జరుగుతుందని, అలాగే.. ఈ సినిమా షూటింగ్ ను కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్నప్పటికీ .. నాగ్ వేక్సిన్ సెకండ్ డోస్ సైతం వేయించుకోవడంతో.. షూటింగ్ ను నాన్ స్టాప్ గా జరుపుతున్నారట.











