నాగార్జున కూడా ఓ వైపు మా స్టార్ కోసం బిగ్ బాస్ సీజన్ 4 చేస్తూనే, మరోవైపు తాను నటిస్తున్న చిత్రాల షూటింగుల్లో పాల్గొంటూ ఉరుకులు పరుగులు పెడుతున్నారు. బిగ్ బాస్ హోస్టుగా ఆ కార్యక్రమం కోసం వారాంతంలో షూటింగ్ చేస్తూనే మధ్యలో గ్యాప్ దొరకగానే తాను నటిస్తున్న “వైల్డ్ డాగ్” చిత్రం షూటింగ్ కోసం మనాలికి వెళ్లి వస్తున్నారు. అలాగే బాలీవుడ్ చిత్రం “బ్రహ్మాస్త” షూటింగులోనూ పాల్గొంటున్నారట.

కొద్ది రోజుల క్రితం తన కోడలు సమంతను బిగ్ బాస్ హోస్టుగా పెట్టి.. “వైల్డ్ డాగ్” షూటింగ్ చేసి వచ్చారు. మళ్లీ బిగ్ బాస్ చేస్తూనే గ్యాప్ లో మరోసారి “వైల్డ్ డాగ్” షూటింగ్ కోసం మనాలి వెళ్లి వచ్చినట్లు తెలిసింది. బిగ్ బాస్ షో కూడా ఆదివారంతో ముగియనుండటంతో ఆ తర్వాత నాగార్జున సినెమాలపై పూర్తి దృష్టి పెట్టనున్నారు. అలాగే తాను చేయబోయే తదుపరి చిత్రాలు, తన పిల్లలు చేస్తున్న, చేయబోతున్న చిత్రాలపై కూడా ఓ లుక్ వేయనున్నారట.
Must Read ;- బిగ్ బాస్ వెనకున్న గాడ్ ఫాదర్ ఎవరు?











