టాలీవుడ్ కింగ్ నాగార్జున మూవీకి హీరోయిన్ కష్టాలా..? అవును.. నిజమే. ఒక్క నాగ్ అనే కాదు.. సీనియర్ హీరోల సినిమాలకు హీరోయిన్ కస్టాలు తప్పడం లేదు. ఆమధ్య చిరు ఆచార్య నుంచి త్రిష తప్పుకున్న తర్వాత కొంత మంది కథానాయికలను అనుకున్నారు. ఆఖరికి కాజల్ ని ఫిక్స్ చేశారు. అలాగే బాలయ్య అఖండ కోసం కూడా కథానాయికను ఎంపిక చేయడం ఓ సమస్యగా మారింది. ఇప్పుడు నాగ్ వంతు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ టైటిల్ ఘోస్ట్. ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఈ సినిమా పై మరింత క్రేజ్ పెరిగింది.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన నాగార్జునకు హీరోయిన్ కష్టాలు మొదలయ్యాయి. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ సినిమాలో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది. కాజల్ అగర్వాల్ పై కొంత టాకీ పార్ట్ చిత్రీకరించారు. అయితే.. కాజల్ ప్రెగ్నెంట్ కావడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఇక అక్కడ నుంచి హీరోయిన్ కష్టాలు మొదలు. కాజల్ పై చిత్రీకరించిన సన్నివేశాలను మళ్లీ మరో హీరోయిన్ తో షూట్ చేయాలి.
కాజల్ ప్లేస్ లో నటించే హీరోయిన్స్ అంటూ త్రిష, ఇలియానా పేర్లు తెర పైకి వచ్చాయి. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు కన్ ఫర్మ్ అవుతారు అనుకున్నారు కానీ.. ఈ ఇద్దరూ సెట్ కాలేదని తెలిసింది. తాజాగా అమలాపాల్ ను అనుకోవడం కాంటాక్ట్ చేయడం కూడా జరిగింది. అయితే.. రెమ్యూనరేషన్ ఎక్కువ డిమాండ్ చేయడంతో ఈ క్రేజీ మూవీలో నటించే ఛాన్స్ ను మిస్ చేసుకుంది. ఆతర్వాత మెహ్రీన్ ను కూడా కాంటాక్ట్ చేయడం జరిగిందట. ఈ అమ్మడు కూడా భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో మరో హీరోయిన్ కోసం చూస్తున్నారని తెలిసింది. ఈ విధంగా హీరోయిన్ సెట్ కాకపోవడంతో ప్రస్తుతానికి ఈ సినిమా ఆగింది. మరి.. ఈ క్రేజీ మూవీలో నాగ్ సరసన నటించే ఛాన్స్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి.
Must Read ;- బంగార్రాజు సంక్రాంతికి వస్తుందా.? వాయిదా పడుతుందా..?











