టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేద్దామనుకుంటుంటే కరోనా సెకండ్ వేవ్ వచ్చింది. షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇప్పుడు జులై నుంచి తాజా షెడ్యూల్ షూటింగ్ ను ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అయితే.. నాగార్జునను ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా చూపెందుకు క్యారెక్టర్ డిజైన్ చేసాడట ప్రవీణ్ సత్తారు.
ఇందులో నాగ్ ఎక్స్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్. ప్రస్తుతం ఆ పాత్రకోసం నాగ్ చాలా మేకోవర్ అయ్యాడట. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త బయటకు వచ్చింది. అది ఏంటంటే.. ఈ సినిమా కోసం నాగ్ ఇజ్రాయెల్ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నారని టాక్. క్రావ్ మాగా – కత్తిసాము లాంటివి కూడా ట్రై చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ యాక్షన్ సీన్స్ అన్నికూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉంటాయని సినీవర్గాలు చెబుతున్నాయి. ఈ హై వోల్టెజ్ యాక్షన్ సినిమాను నారాయణదాస్ నారంగ్ పి.రామ్మోహన్ రావు శరత్ మరార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
సాధ్యమైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి బంగార్రాజు మూవీ షూటింగ్ ను ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు నాగార్జున. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. జులై లేదా ఆగష్టు నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లి.. సంక్రాంతకి బంగార్రాజును విడుదల చేయాలనేది నాగార్జున ప్లాన్.
Must Read ;- కొడుకుల సినిమా కాపురాలు దిద్దే ప్రయత్నాల్లో నాగ్











