టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కెరీర్ లో ఎప్పటికీ మరచిపోలేని చిత్రాల్లో సోగ్గాడే చిన్ని నాయనా ఒకటి. ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి ప్రీక్వెల్ గా బంగార్రాజు సినిమా రూపొందుతోంది. ఇందులో యువ సమ్రాట్ నాగచైతన్య కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. ఈ చిత్రంలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుంటే, నాగచైతన్య సరసన కృతి శెట్టి నటిస్తుంది. ఈ క్రేజీ కాంబినేషన్‌లో రాబోతోన్న బంగార్రాజు సినిమా పై అంచనాలు విపరీతంగా పెరిగాయి.
ప్రస్తుతం మైసూర్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే.. బంగార్రాజు చిత్రయూనిట్ మొదటి నుండి విభిన్నంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్, పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ లడ్డుండా… ఇలా ప్రతీ ఒక్కదానికి విశేషమైన స్పందన లభించింది. తాజాగా సెకండ్ సింగిల్ నా కోసం.. టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను విడుదల చేశారు. తన ప్రేయసి కృతి శెట్టి కోసం నాగ చైతన్య ఎంతలా తనని తాను మార్చుకున్నాడో ఈ పాటలో చెప్పారు. అనూప్ రూబెన్స్ మంచి మెలోడీ ట్యూన్‌ను అందించగా.. సిధ్ శ్రీరామ్ గాత్రం అద్బుతంగా ఉంది.
నాగ చైతన్య, కృతి శెట్టిల మధ్య మంచి కెమిస్ట్రీ ఉంది. ఈ పాట చివర్లో నాగార్జున, రమ్యకృష్ణ, నాగ చైతన్య, కృతి శెట్టిలు కనిపించారు. అక్కినేని కుటుంబానికి చిరకాలం గుర్తుండిపోయే సినిమా మనం. అందులో కింగ్ నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటించారు. మళ్లీ ఇప్పుడు సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు ప్రీక్వెల్‌గా రాబోతోన్న ఈ బంగార్రాజు చిత్రంలో కలిసి నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సత్యానంద్ స్క్రీన్ ప్లేను అందించారు. మరి.. సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అవుతున్న బంగార్రాజు ఏరేంజ్ సక్సస్ సాధిస్తాడో చూడాలి.
Must Read ;- నాగ్ మూవీకి హీరోయిన్ కష్టాలు











