అక్కినేని నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా విడుదలకు సంబంధించిన సందేహాలన్నీ ఈరోజుతో పటాపంచలైపోయాయి. ఈ సినిమా విడుల ఎప్పుడు? థియేటర్లలో విడుదల ఉంటుందా? ఓటీటీలో మాత్రమే ప్రసారమవుతుందా? లాంటి సందేహాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఏప్రిల్ 2న ఈ సినిమా విడుదలకాబోతోంది. అది కూడా థియేటర్లలోనే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రసార హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు ఇంతకుముందు వార్తలు వచ్చాయి. అలా అమ్మేసిన సినిమాని మళ్లీ వెనక్కి తీసుకున్నారు. దీనికి ప్రత్యేకమైన కారణమం ఉందని నిర్మాతలు అంటున్నారు.
థియేటర్లు 50 శాతం ఆక్కుపెన్సీ నుంచి 100 శాతం ఆక్కుపెన్సీకి మారటం వల్లే నిర్మాతలు తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్టు భావిస్తున్నారు. దీని మీద కూడా నిర్మాతలు వివరణ ఇచ్చారు. దీని మీద ఉన్న సందేహాలన్నిటికీ సమాధానం చెప్పటానికి చిత్రయూనిట్ సన్నద్ధమై ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సినిమా ఓటీటీ హక్కులు మాత్రం నెట్ ఫ్లిక్స్ దగ్గరే ఉంటాయి. కాకపోతే అన్ని సినిమాల మాదిరిగానే సినిమా థియేటర్లలో విడుదలైన నెల రోజుల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది. కాకపోతే నెట్ ఫ్లిక్స్ తాను కొన్న ధరలో కొంత తగ్గించి ఇచ్చిందని తెలుస్తోంది. సినిమా రంగంలోని అన్ని విభాగాలు లాభపడాలన్న ఉద్దేశంతోనే థియేటర్లలో సినిమాని విడుదల చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు నిర్మాతలు తెలిపారు.
ఇందులో నాగార్జున ఎన్ఐఏ ఆఫీసర్ విజయ్ వర్మ పాత్రను పోషించారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి పోస్టు ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయింది. ఈ సినిమా ద్వారా అహిషోర్ సోల్ మన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నాగ్ పక్కన దియా మీర్జా కథానాయికగా నటించింది. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి దీనికి నిర్మాతలు. మరో కీలక పాత్రను సయామీ ఖేర్ పోషించింది. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల సినిమాల విషయంలో నాగార్జున వెనుకబడి పోయారు. 2019 లో ‘మన్మథుడు 2’ తర్వాత నాగార్జున సినిమా ఏదీ ఇప్పటిదాకా విడుల కాలేదు. హిందీ లో ‘బ్రహ్మస్త్ర’ విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ రెండూ కాక ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో మరో సినిమాని నాగార్జున అంగీకరించారు. 2021లో మాత్రం ‘వైల్డ్ డాగ్’, ‘బ్రహ్మస్త్ర’ చిత్రాలతో సరిపెట్టుకోవలసిందే. వైల్డ్ డాగ్ ను నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయనుంది. జనవరి 26న ప్రారంభం కావలసిన ఈ స్ట్రీమింగ్ వాయిదాపడుతూ వస్తోంది. ఇప్పటికి దీని మీద స్పష్టత వచ్చింది. ఈరోజు జరిగిన విలేకర్ల సమావేశంలో అక్కినేని నాగార్జున, సయామీఖేర్, దర్శకుడు అహిషోర్ సోల్ మన్, సంగీత దర్శకుడు తమన్ తదితరులు పాల్గొన్నారు.
ఇది అందరికీ కనెక్ట్ అయ్యే కథ అని నాగార్జున వివరించారు. ‘నాలుగైదు వైల్డ్ డాగ్స్ ఒక సింహాన్ని కూడా చంపగలవు. ఈ టైటిల్ వినగానే సర్ ప్రైజ్ అయ్యాను. ఇందులో వైల్డ్ డాగ్ అనే మిషన్ ఎలా ఉంటుందో తెరమీద చూడాల్సిందే’ అని నాగార్జున చెప్పారు. యధార్థ ఘటనల ఆధారంగా దీన్ని తెరకెక్కించినట్లు దర్శకుడు వివరించారు. వేరే దేశాల్లో దాక్కుని ఉన్న టెర్రరిస్టును ఒక ఇండియా పోలీస్ ఆఫీసర్ వెళ్లి అతన్ని పట్టుకుని తీసుకు రావడమే ఈ కథ అని దర్శకుడు సోల్ మన్ చెప్పారు. ఒక ఇండియన్ గా మనం గర్వంగా ఫీలయ్యే సినిమా ఇదని చెప్పారు.