లాక్ డౌన్ టైమ్ లో ఓటీటీలో ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ అంటూ యూత్ ఫుల్ గా ఎంటర్ టైన్ చేశాడు సిద్ధూ జొన్నలగడ్డ. క్షణం దర్శకుడు రవికాంత్ పేరెపు మలిచిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ డిజిటల్ ప్లాట్ పామ్ మీద బాగానే పే చేసింది. స్వతహాగా రైటర్ అయిన సిద్ధూ జొన్నలగడ్డ ఆ సినిమా ఇన్స్ పిరేషన్ తో ఓ వెరైటీ స్టోరీ రాసుకున్నాడట.
ఆ కథ నచ్చడంతో, దాన్ని సితారా ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత నాగవంశీ .. సిద్ధూ హీరోగా ‘నరుడు బ్రతుకు నటన’ సినిమాాగా రూపొందిస్తున్నారు. ఈ రోజు సినిమా టైటిల్ లోగో లుక్ ను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా విడుదల చేశారు. విమల్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ మీదుంది.