తిరుపతి ఎన్నికల్లో టీడీపీని గెలిపించి.. వైసీపీకి గుణపాఠం చెప్పాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి అన్నారు. అధికార పార్టీకి బుద్ధి చెప్పి, వారి మతోన్మాదానికి చెక్ పెట్టాలంటే.. టీడీపీకి భారీ మెజారిటీ ఇవ్వాలన్నారు. తిరుపతిలోని టీడీపీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
తిరుపతికి పేరుకు ఒక ఎమ్మెల్యేనే ఉన్నా.. పాలన మాత్రం ఐదారుగురు ఎమ్మెల్యేల చేతిలో ఉందని విమర్శించారు. వారంతా కనిపించిన భూమిని కబ్జా చేసుకుంటూ పోతున్నారని, అందుకు సంబంధించిన పూర్తి సమాచారం తన దగ్గర ఉందని తెలిపారు. టీడీపీ కార్యకర్తలను ఆర్థికంగా దెబ్బతీసి, భయబ్రాంతులకు గురిచేయడమే వైసీపీ అజెండా అని, అలాంటి తాటాకు చప్పుళ్లకు బెదరకుండా ధైర్యంగా నిలబడాలని కోరారు. కార్యకర్తలకు అన్యాయం జరిగితే.. పార్టీ అండగా నిలబడుతుందని, పోలీస్ స్టేషన్ ముందు కూర్చుని ధర్నా చేసేందుకు కూడా తాము వెనకాడబోమని అన్నారు. రాబోయే ఎన్నికలో కష్టపడి పనిచేసి, పార్టీ విజయానికి కృషి చేసిన వాళ్లకు తగిన గుర్తింపు ఇస్తామని కిశోర్ కుమార్ రెడ్డి కార్యకర్తలకు హామీ ఇచ్చారు.
Mus Read ;- ఏ1, ఏ2లకు కోర్టు సమన్లు..