నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా వెంకట్ బోయనపల్లి తీస్తున్నారు. కాగా గురువారం హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ చిత్రాన్ని మొదలుపెట్టారు. హీరో హీరోయిన్లపై తీసిన తొలి సన్నివేశానికి నాని తండ్రి గంటా రాంబాబు క్లాప్ నిచ్చారు. దర్శకుడు మెర్లపాక గాంధీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించగా, దర్శకులు శివ నిర్వాణ , వెంకీ కుడుముల స్క్రిప్ట్ ని దర్శక, నిర్మాతలకు అందించారు.

Must Read ;- ‘అంటే.. సుందరానికీ!’ అంటూ రాబోతున్న నేచురల్ స్టార్
కలకత్తా నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. సంగీతాన్ని మిక్కీ జె.మేయర్, సినిమాటోగ్రఫీని జాన్ వర్గేష్ ఎడిటింగ్ ను నవీన్ నూలి అందిస్తున్నారు. నాని కెరీర్ లో అత్యధిక బడ్జెట్ తో దీనిని నిర్మిస్తున్నట్లు, ఇందులో ఛాలెంజింగ్ పాత్రను నాని పోషిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.కాగా ఈ చిత్రం రెగ్యులర్ చిత్రీకరణ ఈ నెలలోనే మొదలవుతుంది.
First clap by Nanna 🙂#ShyamSinghaRoy Begins 🔥 pic.twitter.com/PJf7XOkVTk
— Nani (@NameisNani) December 10, 2020
Also Read ;- ‘ఎఫ్ 3’ లో మూడో ఎఫ్ అర్థం ఏంటో తెలుసా..?











