విద్య, ఆరోగ్యం, ఉపాధి ఈ మూడు కల్పిస్తే చాలు, మాకు ప్రభుత్వాల నుండి ఇంకేమీ వద్దు అని మనలో చాలామందిమి అనుకుంటాం. రాజకీయం అంటే పిల్లలకు మంచి చదువు అందేలా చూడడం, ప్రజలకు ఆర్ధిక భారం లేకుండా వైద్యం అందించడం, పనిచేసే వయసులో ఉన్న ప్రతి ఒక్కరికి చేతినిండా పని కల్పించడం..ఇది అర్థం చేసుకున్న నాయకుడే లోకేష్. అందుకే, ఎన్నో సవాళ్ళతో కూడుకున్న విద్యాశాఖను ఏరికోరి తీసుకున్నారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్స్, పిల్లల పుస్తకాల్లో మార్పులు, చాగంటి గారి ద్వారా నైతిక విలువల బోధనా, టీచర్ల ట్రాన్స్ఫర్స్ లో రాజకీయ జోక్యం పైరవీలు తగ్గించే టీచర్స్ ట్రాన్స్ఫర్స్ యాక్ట్, ఇలా కొత్తకొత్త ఆలోచనలతో విద్యా రంగాన్ని సంస్కరణల బాట పట్టిస్తున్నారు.
ఇక, జగన్ విధ్వంస పాలన కారణంగా అంతర్జాతీయంగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ని తిరిగి నిలబెట్టి, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి, యువతకు ఉద్యోగాలు కల్పించే మరో పెద్ద బాధ్యతని కూడా లోకేష్ భుజాన వేసుకున్నాడు. చంద్రబాబు హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్ ను తీసుకొస్తే, ఆయన కొడుకుగా లోకేష్ వైజాగ్ కి గూగుల్ తీసుకొచ్చారు. 2025 లో మన దేశానికి వచ్చిన విదేశీ పెట్టుబడులలో 50% ఒక్క మన రాష్ట్రానికే వచ్చాయంటే అది లోకేష్ సామర్థ్యానికి నిదర్శనం.
అందుకే ప్రతిష్టాత్మక THE WEEK మాగజైన్, కొత్త ఏడాది తొలి ఎడిషన్ కవర్ పేజి మీద లోకేష్ ఫోటో అచ్చేసింది. లోకేష్ ఇంటర్వ్యూ తో బాటు, లోకేష్ గురించి ప్రముఖుల అభిప్రాయాలు కూడా ఈ పత్రిక ప్రచురించింది. మన దేశంలో THE WEEK కవర్ పేజి పై ప్లేస్ దక్కించుకున్న యంగెస్ట్ మినిస్టర్ లోకేష్ గా రికార్డ్ సృష్టించారు. 18నెలలుగా లోకేష్ చేస్తున్న అవిశ్రాంత కృషికి ఈ రికార్డ్ జస్ట్ ఒక నిదర్శనం మాత్రమే. ఈ రికార్డ్ లు ఎలా ఉన్నా, లోకేష్ మాత్రం తను యువగళం పాదయాత్ర లో హామీ ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాలు సృష్టించి, తనని తాను చీఫ్ జాబ్ క్రియేటర్ గా చరిత్రలో నిలిచిపోవాలని పట్టుదలగా పనిచేస్తున్నారు.











