ఇచ్చిన మాట ప్రకారం ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండర్ లో ఆ పోస్టులన్నింటినీ పొందుపర్చాలని డిమాండ్ చేస్తూ ఏపీలో విద్యార్థి సంఘాలు అందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. నిరుద్యోగ సమస్యలపై ధర్నాలు, రాస్తారోకోలు చేస్తుండటంతో ఏపీ ప్రభుత్వానికి ఏమాత్రం మింగుడుపడటం లేదు. విద్యార్థి నేతలు ఆందోళన కార్యక్రమాలు చేస్తే.. ఏ ప్రభుత్వమైనా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తుంది. కానీ జగన్ ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు దిగుతోంది. విద్యార్థి నేతలపై 107 కేసులు నమోదు చేయడమే కాకుండా.. 50 వేల జరిమానా బైండోవర్ కేసు పెట్టింది
జగన్ పై లోకేశ్ ధ్వజం
ఎన్నికలకి ముందు 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని మాటిచ్చి, అధికారంలోకొచ్చాక మాట తప్పిన ముఖ్యమంత్రి తీరుకి నిరసనగా నిరుద్యోగులు శాంతియుత ఆందోళన చేయడం జీర్ణించుకోలేకపోతోంది టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ విడుదల కోసం ఉద్యమిస్తున్నాడన్న కక్షతో విజయనగరం జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శిని తప్పుడు ఆరోపణలతో 107 సెక్షన్ కింద బైండోవర్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. “జగన్ గారూ… ఉపాధి లేక ఉసూరుమంటున్న నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడొద్దు. మీరు ఉద్యోగాలు ఇవ్వలేరని తేలిపోయింది. తప్పుడు నిర్ణయాలతో ఎన్నాళ్లీ అరాచకం సాగిస్తారు?” అని నారా లోకేశ్ మండిపడ్డారు.
Must Read ;- నిరుద్యోగులు మరో పోరాటానికి సిద్ధంకండి!
ఉపాధిలేక ఉసూరుమంటోన్న నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడొద్దు @ysjagan గారూ! మీరా ఉద్యోగాలివ్వలేరు.. ఉద్యమించినోళ్ల గొంతు ఇలా తప్పుడు కేసులతో, తప్పుడు నిర్ణయాలతో నొక్కేస్తారు? ఎన్నాళ్లీ అరాచకం సాగిస్తారు?(4/4)#JaganCheatedAPYouth
— Lokesh Nara (@naralokesh) July 16, 2021