ప్రభుత్వ హత్యలకు జగన్ రెడ్డి బాధ్యత వహించాలని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ప్రభుత్వం ఆధిపత్య రాజకీయాలపై చూపించే శ్రద్ధ…. ప్రజలకు ఆక్సిజన్ అందించడంపై చూపెడితే హిందూపురం ఆస్పత్రిలో 8 మంది చనిపోయేవారు కాదన్నారు. ప్రతిపక్షనేతల్ని కక్షగట్టి అరెస్ట్ చేయించేందుకు వాడుతున్న యంత్రాంగాన్ని ప్రజలు ప్రాణాలు కాపాడేందుకు వాడితే కర్నూలు ఆస్పత్రిలో ఆరుగురి ఊపిరి ఆగిపోయేది కాదని తెలిపారు. దొంగ ఓట్లు వేయించుకోవడంపై పెట్టిన శ్రద్ధ, ప్రజలపై పెట్టడం లేదని అన్నారు. టీడీపీ రాష్ర్ట అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందిస్తూ… హిందూపూర్ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఆధిపత్య రాజకీయాలపై చూపించే శ్రద్ధ, ప్రజలకు ఆక్సిజన్ అందించడంపై చూపెడితే హిందూపురం ఆస్పత్రిలో 8 మంది చనిపోయేవారు కాదు. ప్రతిపక్షనేతల్ని కక్షగట్టి అరెస్ట్ చేయించేందుకు వాడుతున్న యంత్రాంగాన్ని ప్రజలు ప్రాణాలు కాపాడేందుకు వాడితే..(1/5) pic.twitter.com/AzfBFkuqoy
— Lokesh Nara (@naralokesh) May 3, 2021











