దుగ్గిరాల మండలంలో హత్యాచారానికి గురై హత్య కాబడిన తిరుపతమ్మ కుటుంబానికి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అండగా నిలిచారు. ఈ మేరకు మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో బాధిత కుటుంబాన్ని నారా లోకేశ్ వారి ఇంటికి వెళ్ళి పరామర్శించి తెలుగుదేశం పార్టీ తరఫున 5 లక్షల పరిహారం చెక్కును స్వయంగా అందజేశారు.
తిరుపతమ్మ కుమార్తె అఖిల పేరిట 3 లక్షలు, కుమారుడు వరుణ్ సాయి పేరిట 2 లక్షల రూపాయల ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయించిన చెక్కులను లోకేష్ అందజేశారు. తిరుపతమ్మ కుటుంబానికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఓ సోదరుడిలా ఆదుకుంటానని వారికి ధైర్యం చెప్పి హామీ ఇచ్చారు.