సౌత్ ఇండియాలో ఇప్పుడు యంగ్ లీడర్ల గురించి ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోంది. సౌత్ పాలిటిక్స్ చూస్తే చాలామంది యువ నేతలు కనిపిస్తారు. కానీ, అందులో తన పనితీరుతో అందరికంటే ముందుంటూ అటు ప్రభుత్వంలోనూ, ఇటు జాతీయ స్థాయిలోనూ తన మార్క్ చూపిస్తున్న లీడర్ మాత్రం నారా లోకేష్ అనే చెప్పాలి. పక్క రాష్ట్రాల నేతలతో పోల్చి చూస్తే లోకేష్ స్పీడ్, అడ్మినిస్ట్రేషన్‌లో దూకుడు పూర్తిగా డిఫరెంట్‌గా కనిపిస్తున్నాయి.
మిగతా సౌత్ స్టేట్స్‌లోని యంగ్ లీడర్లతో పోలిస్తే లోకేష్ గ్రాఫ్ క్లియర్‌గా పైకి వెళ్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, సీఎం రేవంత్ రెడ్డి తన మార్క్ పాలనను పూర్తిగా సెట్ చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తోంది. ఇక తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్, తెలంగాణలో కేటీఆర్ లాంటి యువ నేతలు ప్రస్తుతం పవర్లో లేరు. కానీ లోకేష్ మాత్రం అటు పాలిటిక్స్‌లోనూ, ఇటు అడ్మినిస్ట్రేషన్‌లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు.
ముఖ్యంగా పెద్ద ఇండస్ట్రీలను ఆకర్షించడంలో, పెట్టుబడుల విషయంలో లోకేష్ వేస్తున్న అడుగులు ఎంతో పర్ఫెక్ట్గా ఉంటున్నాయి. గ్లోబల్ కంపెనీలతో మాట్లాడటం, రాష్ట్రానికి పెట్టుబడులు తేవడంలో ఆయన చూపిస్తున్న చొరవ కార్పొరేట్ వర్గాలను కూడా ఆకట్టుకుంటోంది. అలాగే కేంద్ర ప్రభుత్వంతో డీల్ చేసే విషయంలో, రాష్ట్ర అవసరాల కోసం సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న తీరు ఆయనలోని పొలిటికల్ మెచ్యూరిటీని బయటపెడుతోంది. కేవలం పొలిటికల్ కామెంట్స్ చేయడం కాకుండా, క్షేత్రస్థాయిలో పని చేసి చూపించడమే ఆయన స్టైల్.
గతంలో తనపై వచ్చిన విమర్శలన్నింటినీ పక్కన పెట్టి, తన పనితీరుతోనే అందరికీ సమాధానం చెప్పారు లోకేష్. ప్రజల్లో తిరుగుతూనే, పాలనలోనూ తగ్గేదేలే అంటున్న ఆయన తీరు చూస్తుంటే…సౌత్ ఇండియాలో అన్నివిధాలా దూసుకుపోతున్న వన్ అండ్ ఓన్లీ యంగ్ లీడర్ ఆయనే అనిపించక మానదు. ఈ దూకుడు ఇలాగే కొనసాగితే జాతీయ స్థాయిలోనూ ఆయన పేరు ఇంకా గట్టిగా వినిపించడం పక్కా!











