నవ్యాంధ్ర అభివృద్ధిపై ఒకప్పుడు అనుమానాలు వ్యక్తం చేసిన పెద్దలే ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామిక నిపుణుడు, ఇన్ఫోసిస్ మాజీ CFO టి.వి. మోహన్‌దాస్ పాయ్.. AP ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ పనితీరును అభినందిస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సరిగ్గా రెండేళ్ల క్రితం అంటే 2024 అక్టోబర్‌లో లోకేష్ కంపెనీలను ఏపీకి ఆహ్వానించినప్పుడు, పాయ్ కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం చేసిన విధ్వంసం వల్ల ఆంధ్రప్రదేశ్‌పై పెట్టుబడిదారులకు నమ్మకం పోయింది, అమరావతిలో పనులు కనిపించాలి, కనెక్టివిటీ పెరగాలని అప్పట్లో ఆయన ప్రశ్నించారు. ట్వీట్ కూడా చేశారు.
కానీ, ఆ విమర్శలను లోకేష్ పాజిటివ్‌గా తీసుకుని రాష్ట్రాన్ని వేగంగా ముందుకు నడిపించారు. సరిగ్గా రెండేళ్ల తర్వాత 2026 అక్టోబర్ 24న అమరావతి డెవలప్మెంట్ విజువల్స్, లోకేష్ స్పీచ్ వీడియోను చూసిన పాయ్ మనసు మార్చుకున్నారు. లోకేష్ అద్భుతంగా పనిచేస్తున్నారు.. దేశానికే ఏపీ మార్గం చూపుతోంది అంటూ తాజాగా ప్రశంసల వర్షం కురిపించారు.
మొదట్లో ఏపీ అభివృద్ధిపై అనుమానాలు వ్యక్తం చేసిన పారిశ్రామిక దిగ్గజాలే లోకేష్ కష్టాన్ని చూసి మెచ్చుకుంటుండటం విశేషం. తండ్రి చంద్రబాబు కంటే గట్టిగా కష్టపడుతూ, మాటల్లో కాకుండా చేతలతో ఏపీని నడిపిస్తున్న లోకేష్ తీరుపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి.











