టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అక్రమ అరెస్టై గత 50 రోజులుగా జైలులో ఉన్నారు.. చేయని తప్పుకు ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు.. ఇంతవరకు ఆయనపై ఒక్క ఆధారాన్ని కూడా బయటపెట్టలేదు సీఐడీ.. చంద్రబాబుపై దేశవ్యాప్తంగా పలు నగరాలలో పర్యటించి ప్రెస్ మీట్ లు పెట్టి మరీ చేయని తప్పుని ప్రచారం చేశారనే వాదన ఉంది.. దీనిపై తాజాగా కోర్టులో కేసు కూడా నమోదు అయింది.. త్వరలోనే విచారణ జరగనుంది…
మరోవైపు, చంద్రబాబు రిలీజ్‌పై టీడీపీ యువనేత లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు ఒకటి లేదా రెండు వారాలలో విడుదలై బయటకు వస్తారని తాము ఆశిస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు.. గత 50 రోజులుగా జైలులో ఉన్న చంద్రబాబు క్వాష్ పిటీషన్‌పై ఇప్పటికే తీర్పు రిజర్వ్ అయింది.. ప్రస్తుతం సుప్రీం కోర్టుకి దసరా హాలీడేస్ నడుస్తున్నాయి.. ఈ ఆదివారంతో విజయ దశమి సెలవులు ముగియనున్నాయి.. అంటే, సోమవారం నుండి ఏ క్షణమైనా ఈ కేసుపై తీర్పు వచ్చే అవకాశం ఉంది.. ఈ తీర్పుపై టీడీపీ నేతలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..
సుప్రీం కోర్టులో స్కిల్ డెవలప్ మెంట్ కేసుపై సీఐడీ తరఫు లాయర్లు పస లేని వాదన వినిపించడం, ఇటు ప్రభుత్వం తరఫు నుండి ఎలాంటి ఆధారాలు ప్రవేశ పెట్టకపోవడంతో.. తీర్పు చంద్రబాబుకి అనుకూలంగా వస్తుందని భావిస్తున్నారు.. ఇది కేవలం రాజకీయ కక్షతో కూడిన అక్రమ కేసు అని ఇప్పటికే తెలుగు తమ్ముళ్లు వాదిస్తున్నారు.. అందుకే, ఇవాళ రాజమండ్రి జైలులో చంద్రబాబుని పరామర్శించిన లోకేష్… చంద్రబాబు త్వరలో విడుదల కావడం ఖాయం అని, మహా అయితే మరో వారం లేదా రెండు వారాలు మాత్రమే అని డేట్‌తో సహా ధీమా వ్యక్తం చేశారు.. అంతేకాదు, జగన్ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడని నిప్పులు చెరిగారు.. గత పదేళ్లుగా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ జగన్ కనీసం తన కేసులపై విచారణకు కూడా హాజరవడం లేదని లోకేష్ గుర్తు చేశారు.. తాము వ్యవస్థలను మేనేజ్ చేయడం లేదని, చేస్తే ఎందుకు చంద్రబాబు జైలులో ఉంటారని నీలి, కూలి మీడియా ప్రతినిధులను నిలదీశారు..
ఇటు, సోమవారమే చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఏపీ హైకోర్టులోనూ విచారణ జరగనుంది.. ఇప్పటికే వెకేషన్ బెంచ్ మీదకు వచ్చిన ఈ కేసుపై జడ్జి జ్యోతిర్మయి నాట్ బిఫోర్ మీ అన్నారు.. దీంతో, సోమవారం ఈ కేసు కోర్టులో విచారణకు రానుంది.. హై కోర్టులో అయినా చంద్రబాబుకు ఆరోగ్య కారణాలపై ఊరట లభిస్తుందనే పలువురు న్యాయవాదులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.. ఇలా, ఏ క్షణమైనా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలు నుండి బయటకు రావడం ఖాయం అని భావిస్తున్నారు.. మరి, ఏం జరుగుతుందో చూడాలి..