నారా లోకేష్.. శుక్రవారం నాడు అమరావతి ప్రాంతంలో మునిగిపోయిన పొలాల్లో పర్యటించారు. భారీ వర్షాలకు వేల ఎకరాల పొలాలు మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రాంతాల్లో లోకేష్ పర్యటించి.. నష్టపోయిన రైతులతో మాట్లాడారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఊరడించే ప్రయత్నం చేశారు.
నారా లోకేష్.. రైతులతో చాలా సేపు గడిపారు. ఈ ప్రాంతంలో పసుపు ఇతర పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. పొలాలు మొత్తం నీటి మడుగుల్లాగా మారిపోయాయి. నారా లోకేష్ రైతులతో కలిసి ఈ నీటి మడుగుల్లా మారిన పొలాల్లోనే పర్యటించారు. వాటిల్లిన నష్టం గురించి చాలా ఓపికగా రైతులు చెప్పిన సంగతులన్నీ విన్నారు.
అనూహ్యమైన ఫిట్‌నెస్
అసలు చాలా గ్యాప్ తర్వాత జనంలోకి వచ్చిన లోకేష్ ను చూసిన వారు ఒక రకంగా ఆశ్చర్యపోయారనే చెప్పాలి. మామూలుగా బొద్దుగా ఉండే నాయకుడిగా ముద్ర ఉన్న లోకేష్.. ఈ పర్యటనలో చాలా స్లిమ్ గా కనిపించారు. నిజానికి కొన్ని రోజుల కిందట అమరావతి రాజధాని పోరాటం 300వ రోజుకు చేరుకున్న సందర్భంగా కూడా… ఆయన అమరావతి పోరాట దీక్షల శిబిరాన్ని సందర్శించారు. ఆయన స్లిమ్ అయిన సంగతి ఆరోజు కూడా కొందరు గమనించారు గానీ.. ఆయన ఫిట్ నెస్ ఏ పాటి ఉందో తెలియలేదు.
అయితే, శుక్రవారం నాటి పర్యటనలో మాత్రం.. ఇంతదూరం పొలాల్లో నడవడం, రైతులతో ఓపికగా వ్యవహరించడం ఇదంతా గమనించిన వారు ఆశ్చర్యపోయారు. నారా లోకేష్ ఫిట్ గా మారడం మాత్రమే కాదు.. ఏకంగా సిక్స్ ప్యాక్ బాడీ కూడా సాధించేశారేమో అని కూడా కొందరు సరదాగా వ్యాఖ్యానించుకున్నారు.
ఇలా ఎలా..?
లాక్ డౌన్ విధించిన తర్వాత.. కొన్ని సందర్భాల్లో మాత్రమే నారా లోకేష్ బయటకు వచ్చారు. అయితే ఇంట్లో ఆయన ఫిట్నెస్ మీద పూర్తిగా శ్రద్ధ పెట్టినట్టు కనిపిస్తోంది. సాధారణంగా లాక్ డౌన్ ఎఫెక్ట్ ప్రజలందరూ కూడా ఇళ్లు కదలకుండా కూర్చొని బాడీ పెంచేసినట్టుగా .. అనేకానేక జోకులు వస్తుంటాయి. కానీ.. నారా లోకేష్ మాత్రం దీనికి రివర్స్ అన్నట్లుగా.. బాడీని పూర్తిగా తగ్గించేయడం గమనార్హం.
విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి నారా లోకేష్ తన ఫుడ్ హేబిట్స్ పూర్తిగా మార్చుకున్నారు. మొత్తం వెజిటేరియన్ లోకి మారిపోయి.. వీలైనంత ఎక్కువగా ఆకుకూరలు లాంటివి తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా ఒక జిమ్ ట్రైనర్ ను పెట్టుకున్నారు. ప్రతిరోజూ ఉదయం నాలుగింటికే లేచి ఏకబిగిన రెండున్నర గంటల పాటు వ్యాయామం చేస్తున్నారు. కఠినమైన శిక్షణతో ఫిట్‌నెస్ సాధన చేస్తున్నారు. ఆయనను లేటెస్టు అమరావతి టూర్ లో చూసిన వారు మాత్రం.. ఇంకొన్ని నెలలు గడిస్తే సిక్స్ ప్యాక్ గ్యారంటీగా వచ్చేస్తుందనే అనుకుంటున్నారు. లుక్ పరంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దీటుగా లోకేష్ కూడా తయారవుతున్నారనే మాట వినిపిస్తోంది. స్లిమ్ అయిపోయిన నారా లోకేష్ ఈ ఫిట్నెస్ తో రాజకీయాల్లో కూడా ఇలాగే దూసుకెళ్లాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Watch Video:
అమరావతిలో లోకేష్ పర్యటన (గ్యాలరీ చూడండి)