అనంతపురం జిల్లా రాప్తాడులో ఉన్మాది దా*డిలో తీవ్రంగా గాయపడిన బాలిక బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో ప్రాణాల కోసం పోరాడుతోంది. అత్యవసర చికిత్సలో భాగంగా ఆర్ధోపెడిక్, ప్లాస్టిక్ సర్జీలు విజయవంతంగా పూర్తయ్యాయని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శస్త్ర చికిత్సల తర్వాత విద్యార్ధి పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. పోస్ట్ ఆపరేషన్ మానిటరింగ్ కోసం బాలికను పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి తరలించారు.
బాలిక కోలుకోవాలని ప్రతి ఒక్కరూ చేసిన ప్రార్ధనలు ఫలించాయని.. చికిత్సలో కీలకమైన దశ విజయవంతంగా పూర్తి కావడం ఎంతో ఊరటనిచ్చిందని మంత్రి లోకేశ్ చెప్పారు. తీవ్రంగా గాయపడిన విద్యార్ధికి అత్యత్తమ వైద్యం అందించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న వైద్య బృందానికి మంత్రి లోకేశ్ తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ చిరునవ్వులు చిందించాలని మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నానని లోకేశ్ తెలిపారు.
పదో తరగతి విద్యార్ధిపై ఉన్మాది దా*డి గురించి తెలియగానే వెంటనే స్పందించిన విద్యాశాఖ మంత్రి లోకేశ్.. మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు. కర్నాటక ప్రభుత్వంతో మాట్లాడి ప్రత్యేక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి.. స్పెషల్ లైఫ్ సపోర్ట్ అంబులెన్సులో బాలికను సూపర్ స్పెషాలిటీ హాస్పటల్కి తరలించారు.
అధికారులకు ఆదేశాలు ఇచ్చి.. సోషల్ మీడియా పోస్టులు చేయడంతో ఆగకుండా.. మంత్రి నారా లోకేశ్ ఆదివారం మధ్యాహ్నం స్వయంగా బెంగళూరు మణిపాల్ హాస్పటల్కి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న విద్యార్ధిని పరామర్శించి.. బాలికకు అందిస్తున్న ట్రీట్మెంట్ గురించి వైద్యులతో చర్చించారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించి త్వరగా కోలుకోవడానికి కృషి చేయాలని డాక్టర్లను విజ్ఞప్తి చేశారు. విద్యార్ధి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. తన సొంత బిడ్డకే ఆపద వచ్చినట్లుగా తపన పడుతూ.. ఆమె త్వరగా కోలుకోవడానికి లోకేశ్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.











