విక్టరీ వెంకటేష్ ‘నారప్ప’ ఉగాది సర్ ప్రైజ్ ఇచ్చేశారు. ఈ సినిమాలో నారప్ప కుటుంబం పోస్టర్ ను విడుదల చేశారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి, వి క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను ఈ `నారప్ప` నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియమణి నారప్ప భార్య `సుందరమ్మ`గా చేస్తోంది. తెలుగు వారికి చాలా రోజులు గుర్తుండిపోయే పాత్ర ఇదని అంటోంది ప్రియమణి. నారప్ప సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్, పోస్టర్లతో పాటు వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా విడులైన `నారప్ప` టీజర్‌కి కూడా మంచి స్పందన వస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. తెలుగు సంవత్సరాది పర్వదినాన్ని పురస్కరించుకుని నారప్ప ఫ్యామిలీతో కూడిన స్పెషల్ ఫ్యామిలీ పోస్టర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. తెలుగు వారి సంప్రదాయ వస్త్రధారణ అయిన పంచెకట్టులో వెంకటేష్ నడిచివచ్చే పోస్టర్ ఇది. ఈ సినిమాలో ఇంకా కార్తిక్ రత్నం, రావు రమేష్, రాజీవ్ కనకాల తదితరులు నటిస్తున్నారు. మణిశర్మ దీనికి సంగీతం సమకూరుస్తున్నారు.
Must Read ;- వెంకీ యంగ్ ‘నారప్ప’ లుక్ అదుర్స్











