పల్నాడు మారుతున్న రాజకీయం.. వైసీపీకి గుడ్ బై చెప్పనున్న ఎంపీ..?
ఏపీ సీఎం జగన్ రెడ్డి నమ్మి.. విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, స్థిరాస్తి వ్యాపారులు వందల కోట్లు ఖర్చు చేసి ఎంపీలు అయ్యారు. నేడు నిండా మునిగారు.
నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజుకు జరిగిన ఘోర పరాభవం దేశం మొత్తం చూసింది. ఆయన జీవితంలో ఎన్నడూ చూడని అవమానాలు, మానసిన వేదనలను జగన్ రెడ్డి పరిచయం చేశారు. పార్టీ ఎంపీ, అందులో వయసులో పెద్దవాడు.., తన తండ్రికి మిత్రుడు, సలహాదారుడు అని ఏమీ చూడలేదు జగన్. ఉత్తి పుణ్యానికే ఎంపీ రఘురామ నాకు నచ్చలేదని సైకో మాదిరిగా అరెస్ట్ చేసి.. ఈడ్చుకెళ్లి జైల్లో పడేశాడు. అంతటితో ఆగకుండా తీవ్ర నేరారోపణలున్న వ్యక్తులను ట్రీట్ చేసినట్లు థర్డ్ డిగ్రీ ఇచ్చి చిత్ర హింసలకు గురిచేశాడు. దీంతో రఘురామ హింస నుంచి తేరుకుని.. రెబల్ ఎంపీగా మారాడు. ప్రతిరోజు ఢిల్లీ నుంచి రచ్చబండ పెట్టి.. జగన్ వైఫల్యాలను ఎండగట్టడం ప్రారంభించారు. దీంతో జగన్ తోపాటు.. జగన్ అండ్ కో.., పార్టీ.. ఏపీలో భ్రష్టుపట్టిపోతోంది. మొన్న విశాఖ ఎంపీ భార్యను, కుమారుడిని కిడ్నాప్ చేసి.. హింసించిన సంగతి అందరికీ తెలిసిందే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 22 ఎంపీ స్థానాలను కౌవసం చేసుకున్న వైసీపీ.. ఈ నాగుగేళ్ళల్లో ఆ నలుగురు ఎంపీ లు మినహా ఏ ఒక్కరూ యాక్టీవ్ గా లేరు.అందరూ తీవ్ర అసృంప్తితితో ఉన్నవారే. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, రాజంపేట మిథున్ రెడ్డి, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసౌరి,రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ లు అప్పుడప్పుడు కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజా బాహుళ్యంలో వారి ఉనికిని కాపాడుకుంటున్నారు. మిగతా వారందరూ ఈ నాలుగేళ్ళల్లో ప్రజలకు కనీసం మోహం చూపిన దాఖలాలు లేవు.
ఇలా వైసీపీ ఎంపీల రాజకీయ పరిస్ధితి ఉంటే తాజాగా పల్నాడులో రాజకీయం మారుతోంది. నరసరావుపేట పార్లమెంట్ సిగ్మెంట్ లో ఉన్న ఎమ్మెల్యేలకు ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయల మధ్య రోజురోజుకు గ్యాప్ పెరుగుతోంది. నియోజకవర్గా ల్లో అన్నీ అంశాల్లో ఎమ్మెల్యేలు వర్సెస్ ఎంపీ అన్నట్లు రాజకీయం నడుస్తోంది. దీంతో అధిపత్యం, సామాజీకవర్గ వివక్ష వంటివి అడుగడుగున లావును రాజకీయంగా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్న ఆరోపణలు పార్టీలో బాహాటంగానే వినిపిస్తోంది.
నరసరావుపేట వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయులు యువకుడు, విద్యావంతుడు. రాజకీయంలో అరంగేట్రం చేసిన అనతికాలంలోనే ప్రజల్లోనూ.., పార్టీలోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ.., ప్రజలతో మమేకమైయ్యే ప్రతీ కార్యక్రమంలో తనదైన ముద్రవేసుకుని గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే.., ఎంపీ లావు వేస్తున్న అడుగులు.., ప్రజల్లో చొచ్చుకుపోయే విధానం అధికార పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏడు నియోజకవర్గాల్లోని ఏ గ్రామం నుంచైనా.. ప్రజా సమస్య అంటే తక్షణమే స్పందిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే లావు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే ఎంపీ. ఆయనకు ఫోన్ చేస్తే.. ఒక్కరింగుకే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి.. సమస్యలను పరిష్కరిస్తారు. స్థానిక ఎమ్మెల్యేకు రిఫర్ చేసి.. పరిష్కారం అయ్యే విధానాన్ని కూడా ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు. ప్రజా సమస్యలను ఇంతగా పట్టించుకుని శ్రద్ధ చూపే ఎంపీ దేశంలోనే ఎక్కడ లేరు అని విపక్ష నేతలు సైతం ప్రశంసిస్తారు. ఇలా ప్రజలతో మమేకమై.. , ప్రజా సమస్యల పరిష్కరమే ఎజెండాగా లావు ముందుకు సాగుతున్న వేళ.. ఆయన సంకల్పానికి, స్పూర్తికి సొంతపార్టీ ఎమ్మెల్యేలు గండి కొట్టారు.
దీంతో ఎమ్మెల్యేలతో పోరాడలేక.., లావు తీవ్ర అసంతృప్తితో సైలెంట్ అయ్యారు. ఎంపికి కనీసం ప్రోటోకాల్ ఇవ్వని సొంతపార్టీ ఎమ్మెల్యేలలో ముందు వరుసలో చిలకలూరిపేట ఎమ్మెల్యే, మంత్రి విడుదల రజనీ ఉంటారు. ముందు నుంచి కూడా వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇరువురి మధ్య వర్గపోరు నడిరోడ్డుపై కొట్టుకునే వరకు వచ్చిన సంఘటనలు అనేకం. దీనిపై ఎంపీ లావు పలు పర్యాయాలు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళిన పెద్దగా పట్టించుకోలేదు. ఈ పోరు ఒక్క రజనీతో ఆగలేదు.. సత్తెనపల్లి, పెదకూరపాడు, వినుకొండ, నరసరావుపేట నియోజకవర్గాలకు పాకింది. ఇక్కడి ఎమ్మెల్యేలు కూడా ఎంపీ లావు వర్కింగ్ స్టైల్ చూసి.., అక్కసు పెంచుకోవడం మొదలుపెట్టారు.
తాడేపల్లి కోట దాటి రాని సీఎం.. ఫోన్ చేస్తే పలకడు.. అపాయింట్మెంట్ ఇవ్వడు. దీంతో అడకత్తెరలో పోకు చక్కలా మారింది ఎంపీ లావు రాజకీయ ప్రయాణం. మరోవైపు పార్టీ అధిష్టానం కూడా ఎంపీ ఫిర్యాదులను లక్ష్యపెట్టలేదు. దీంతో పూర్తిస్థాయిలో ఎంపీ పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు కేడర్ ద్వారా తెలుస్తోంది. ఆ మొన్న చిలకలూరిపేటలో సీఎం పర్యటనలో కూడా ఇదే విషయాన్ని సభావేదికపై లావు వ్యక్తం చేశారు. కానీ సీఎం జగన్ లైట్ తీసుకున్నారు. ఉంటే ఉండూ.. లేకుంటే పో.. అన్న మాదిరిగా పార్టీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరు లావును రాజకీయంగా కుంగదీస్తోంది. దీంతో తీవ్ర అసంతృప్తితో విలువలేని పార్టీలో కొనసాగడం కన్నా.. పార్టీ మారడం మంచిదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రేపోమాపో పార్టీ కండువా మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కేడర్ చెప్తోంది. కమ్మ సామాజీకవర్గానికి చెందిన లావు.. తెలుగు దేశం పార్టీలో చేరే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ.., ఆయన తెలుగుదేశంలో చేరుతాడు..? మరేదైన పార్టీలో చేరుతాడా..? లేక రాజకీయాలు నుంచి తప్పుకుంటారా..? అన్నదీనిపై స్పష్టత రావాల్సి ఉంది.