మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) విజన్ లేకుండా పనిచేస్తోందన్న నటుడు ప్రకాష్ రాజ్ నిన్న మీడియా సమావేశంలో చేసిన విమర్శలను తిప్పికొట్టేందుకు మా అధ్యక్షుడు నరేష్ ప్రెస్ మీట్ ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి మా ప్రధాన కార్యదర్శి జీవిత హాజరు కావలసి ఉన్నా రాలేదు. మా ప్రతిష్ఠ మసకబారుతోందా? ముందడుగు వేస్తోందా? అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నాన్ని నరేష్ చేశారు. మా ప్రతిష్ఠ మసకబారిపోయింది అంటూ నిన్న నాగబాబు కామెంట్లు కూడా బైలాస్ ప్రకారం కూడా తప్పు అని నరేష్ వ్యాఖ్యానించారు.
‘అలా చెప్పడం మాకే షాక్. ఇది ఒకసారి రుజువు చేయండి అంటూ సవాలు విసిరారు. తాను కథలు చెప్పనని కాగితాలతోనే మాట్లాడానని అన్నారు. మాతో తన ప్రయాణం ఆరేళ్లుగా సాగుతోందని వివరించారు. ప్రకాష్ రాజ్ నిన్న డేటా అన్నారు కాబట్టి ఈ డేటాను ఇస్తున్నామన్నారు. మాకు కచ్చితంగా భవనం కావాలని సీఎంకు వినతి పత్రం ఇచ్చాం. భవనం కచ్చితంగా వస్తుంది. మంచి కార్యాలయానికి మా వంతు తోడ్పడతామని అన్నారు. ‘400కు పైగా ఓట్లు సాధించి తాను అధ్యక్షుడిగా గెలిచానన్నారు.
‘సినీ పరిశ్రమకు ఎలాంటి సమస్య వచ్చినా నరేష్ చేయలేదు అనేది ఎంతవరకు నిజం? మూడు నెలల క్రితం ప్రకాష్ రాజ్ ఫోన్ చేసి తాను పోటీ చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. తెలుగు సినిమాలో పోటీ చేసేవారు ఎవరైనా పోటీ చేయవచ్చు. విష్ణు కూడా ఫోన్ చేశాడు. ఎవరొచ్చినా స్వాగతం అన్నాను. మా అనేది ఒక రాజకీయ వ్యవస్థ కాదు. ఎంతో మంది పెద్దలు ఇటుకలతో పేర్చి ‘మా’ని కట్టారు. కరోనాలో ఇన్సూరెన్స్ పనులు జరుగుతున్నాయి. ఫోర్స్ లో ఉన్న కమిటీ మెంబర్స్ కూడా పాల్గొన్నారు. అలా పాల్గొనడం కూడా తప్పే.
లోకల్ నాన్ లోకల్ అని మీరంటున్నారు మేమనడం లేదు. ఇప్పటికీ ఎన్నికలు ఏకగ్రీవం కావాలని మేము కోరుకుంటున్నాము. ఏప్రిల్ 9న ప్రకాష్ రాజ్ లేఖ రాస్తే 12న సమాధానం ఇచ్చాం. జనరల్ బాడీ ఎందుకు జరపడం లేదని అంటున్నారు. మాకు అధికార దాహం లేదు. విజన్ తో పనిచేశాం. నటుల మధ్య ఉన్నాం. ప్రకాష్ రాజ్ దగ్గర డేటా లేదు. మాలో 914 మంది లైఫ్ మెంబర్స్ ఉన్నారు.
మా 26 మంది కమిటీ ఏంచేయాలో అది చేశాం. 728 మందికి ఇన్సూరెన్స్ చేశాం. 16 మందికి 48 లక్షలు ఇన్సూరెన్స్ అందించాం.314 సభ్యులకు మెడికల్ ఇన్సూరెన్స్ ఇచ్చాం. ఇది విజన్ కాదా? వెయ్యి రూపాయల పెన్షన్ ను ఆరువేలు చేశాం. సంస్థను కించ పర్చేలా మాట్లాడటం తప్పు. మాకు విజన్ లేదనడంం తప్పు’ అని వివరించారు. మా పనితీరు బాగోలేదని విమర్శించడం తప్పన్నారు. తాము ఏం చేశారో తెలుసుకుని మాట్లాడాలన్నారు. ఆడవాళ్లంటే గౌరవం లేని వ్యక్తుల్ని మేం అంగీకరించం అని కరాటే కళ్యాణి అన్నారు. నటుడు శివబాలాజీ, కరాటే కళ్యాణి, గౌతంరాజు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Must Read ;- షాకింగ్ చిరు మద్దతు ఇస్తున్న ప్రకాష్ రాజ్ ని సపోర్ట్ చేస్తూ వర్మ ట్వీట్స్