నరేష్ వీకే లేదా సీనియర్ నరేష్.. సినిమా రంగంలో ఈ పేరు తెలియని వారు ఉండరు. పండంటి కాపురం చిత్రంతో బాల నటుడిగా, నాలుగు స్తంభాలాటతో హీరోగా సినీ రంగప్రవేశం చేసి దాదాపు 50 ఏళ్లు అయ్యింది.
ఏడాదికి దాదాపు ఏడెనిమిది చిత్రాలు చేస్తూ బిజీ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరంటే నరేష్ పేరే చెప్పాలి. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ జనం ఆదరాభిమానాల్ని చూరగొంటున్న నరేష్ వీకే తాజాగా మార్టిన్ లూథర్ కింగ్ చిత్రంతో జనం ముందుకు వస్తున్నారు. ఈ సందర్భండా మీడియాతో తన సినిమా అనుభవాలను పంచకున్నారు. ఆ విశేషాలివి.
* మార్టిన్ లూథర్ కింగ్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు?
మహాతో ట్రావెల్ నాకు ఉమామహేశ్వర ఉగ్రరూపస్యతో ప్రారంభమైంది. ఇది యువదర్శకుల యుగం.అందుకే నేను ఇక్కడ ఉన్నా. మార్టిన్ లూథర్ కింగ్ సినిమా గురించి చెప్పాలంటే బుల్లెట్ కైండ్ ఆఫ్ మెసేజ్. ఎంటర్ టైన్ మెంట్ , మెసేజ్ కలిసి రావడం కష్టం. వైజాగ్ నుంచి ప్రీమియర్ స్టార్ట్ చేశాం. వరంగల్, విజయవాడలాంటి ప్రదేశాల్లో పీమియర్లు వేశాం. సినిమా మీద నమ్మకం, సినిమాలో దమ్ము ఉంటే ప్రజలకు ముందు చూపించి తర్వాత విడుదల చేయవచ్చు. సామజవరగమన విషయంలో అలానే చేశాం. మహాయాన, వై నాట్ రిలయన్స్ వాళ్లు దీన్ని నెక్ట్స్ లెవల్ కు తీసుకువెళ్లారు.కంటిన్యూగా ప్రివ్యూస్ వేసుకుంటూ వచ్చారు.
వరంగల్ లో నేను ప్రత్యేక సాక్షి నేను. మహిళలు, యూత్ , ఫ్యామిలీలు.. ఇలా అన్ని రకాల వాళ్లూ వచ్చారు. సినిమా ఆసాంతం క్లాప్స్ మోగుతూనే ఉన్నాయి. జనం చాలా ఎంజాయ్ చేశారు. ఏడాదిలో నా సినిమాలు ఏడెదిమిది విడుదలయ్యాయి. దాదాపు అన్నీ హిట్టే. సామజవరగమన, ఓటీటీలోనూ వరుస హిట్లు వచ్చాయి. నాకు వచ్చే సబ్జెక్ట్స్ లో నేను మంచివి సెలెక్ట్ చేసుకుంటున్నా. నెల రోజుల్లో 14 సబ్జెక్టులు విన్నా. చాలా మంది యువదర్శకులు కొత్త సబ్జెక్టులతో వస్తున్నారు. ప్రతి సీజన్ కీ ఒకటి చేస్తాం. సమ్మర్ కు కొబ్బరి నీళ్లు తాగాలి, బూమ్ బూమ్ కూడా ఉంది. ఎవరి ఇష్టం వాళ్లది. అదే విధంగా చలికాలంలో చక్కటి బజ్జీలు తిని వేడి వేడి కాఫీ తాగుతాం. ఇది పొలిటికల్ సీజన్ ఇది.ప్రత్యేకంగా రెండు తెలుగు రాష్ట్రాలు బాయిలింగ్ పాయింటులో ఉన్నాయి.
ఎవర్ని ఉద్దేశించి తీసిన సినిమా కాదుగానీ ఇవాళ జరుగుతున్న పొలిటికల్ సిట్యుయేషన్స్ కు సరిపోయే సినిమా. ఇలాంటి రాజకీయ పరిస్థితులకు బలవుతున్నది మాత్రం కామన్ మ్యాన్. దాన్ని బేస్ చేసుకుని తీసిన పొలిటికల్ సెటైర్ ఈ సినిమా అనొచ్చు. వెంకటేష్ మహా రచన, పూజ కొల్లూరు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కింగ్ రోల్ సంపూకి సెకండ్ లైఫ్ అనుకోవచ్చు. రెండు లీడ్ రోల్స్ నేను, వెంకట్ మహా చేశాం. 30 నుంచి 40 మంది కొత్తవాళ్లను కూడా ఈ సినిమా ద్వారా పరిచయం చేశారు. ఈ కింగ్ నాకు కూడా కొత్త ఎక్స్పీరియన్స్. ఓ పక్క వారసత్వ రాజకీయాలు, ఇంకో పక్క రాజకీయ బిజినెస్ ముడిపడి ఉంది.
మార్పు రావాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ఓటు విలువ ఏంటని ఇందులో వినోదాత్మకంగా చూపించారు. ప్రజాస్వామ్యంలో కామన్ మ్యానే కింగ్. ఎన్నుకున్న తర్వాత వాళ్ల వాళ్ల పోరాటాలకు మనం బలవుతున్నాం. ఇందులో నా పాత్ర విషయానికి వస్తే చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునేలా చిన్న వారసత్వంతో ప్రెసిడెంట్ అయిన పాత్ర. ఒకవిధంగా నాకంటే వయసులో 20 ఏళ్లు వయసు తక్కువ పాత్ర ఇది. మహా పాత్ర ఇంకో వర్గం. మన దాంట్లో రాజకీయం అంతా గ్రామాల్లోనే ఉంటుంది. రూరల్ రాజకీయాలు బేస్ చేసుకుని తీసిన సినిమా. ఒంగోలు ప్రాంతంలో వెనుక బడిన గ్రామంలో షూటింగ్ చేశాం. దీని పవర్ స్క్రిప్టులోనే ఉంది. సంపూకి కొత్త లైఫ్ ఇచ్చే సినిమా. నాకు మరో అద్భుతమైన సినిమా. నేనొక లేడీ డైరెక్టర్ కొడుకుని పూజ నాకు ఐదో లేడీ డైరెక్టర్. రానున్న యుగంలో సినిమాల్లో మహిళలు 33 పర్సంట్ కోటా వచ్చేసినట్టే.
* పొలిటికల్ గా ఈ సినిమాలో చెప్పిందేంటి?
ఈ సినిమాలో చాలా మంది కొత్త వాళ్లు పనిచేశారు. 60 మంది నటీనటులంతా స్క్రిప్టు చదువుకున్నాం. వర్క్ షాప్స్ పెట్టుకుని బెటర్ మెంట్ కోసం ప్రయత్నించాం. ఈ కొత్త యుగంలో సినిమాల్లో ఫార్ములా పోతోంది. సామజవరగమన లాంటి కామెడీ ఉండాలి, లేదా నాచురాలిటీ దగ్గరగా ఉండాలి. ఇందులో రెండూ ఉన్నాయి. రియాలిటీకి దగ్గరగా ఉన్న పాత్రలు. సంగీతం మరో హైలైట్. థీమాటిక్ సాంగ్ ఉన్నాయి. మార్టిన్ లూథర్ కింగ్ వాయిస్ వింటాం మనం. సినిమా టోన్ కొత్త మూడ్ లోకి తీసుకు వెళుతుంది.
* మండేలా యథాతథంగా చేశారా?
రీమేక్ అనడం కన్నా ఇన్ స్పైర్ అయి చేసిన సినిమా. మన నేటివిటీ కి తగ్గట్టుగా ఫ్రెష్ ఫిలిం అని చెప్పవచ్చు. యూత్ దీనికి బాగా అట్రాక్ట్ అవుతారు. ప్రమోషన్స్ లో అందరికీ కిరీటాలు ఇచ్చారు.
* మీ పాత్రల కోసం హోంవర్క్ ఏమైనా చేస్తారా? వైవిధ్యం కోసం మీరేం చేస్తుంటారు?
నా పాత్ర విషయంలో డైరెక్టర్ పూజ చాలా కేర్ తీసుకున్నారు. ఈ సినిమా తర్వాత కొత్త నటులు చాలా మంది పుట్టుకొస్తారు. రెండు ప్రాంతాలు ఒకే విలేజ్ లో ఉంటాయి. ఇందులో ప్రత్యేకత అదే. నాది కొత్త గెటప్. ప్రతి పాత్రా కొత్తగా చేయటానికి తపిస్తాను. నాకు యువ దర్శకులు నాకు లైఫ్. వరుసగా లీడ్ రోల్స్ వస్తున్నాయి. ఫిల్మ్ మేకింగ్ మారిపోయి కొత్త సెగ్మెంట్ తయారైంది. అలాంటి పాత్రలు చాలా మందికి వస్తున్నాయి.
* రాజకీయాలు దగ్గర నుంచి చూశారు కదా రాజకీయ వ్యవస్థ గురించి ఏంచెబుతారు?
రాజకీయాలు దగ్గరగా చూడలేదు.. క్రియాశీలకంగా పనిచేశా. ఎనిమిదేళ్లు సినిమా పరిశ్రమను వదిలి వెళ్లాను. నేను ఎమోషనల్ పర్సన్ ని .. నా మనసుకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేస్తా. అది పర్సనల్ లైఫ్ లో కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ లో కావచ్చు. నేను బిజీ హీరోగా ఉన్నప్పుడు సినిమా ఫీల్డును వదిలేశా. 2000 సంవత్సరంలో మన దేశంలో ఒక రివల్యూషన్ వచ్చింది. సంకీర్ణ ప్రభుత్వాత సమయమది. ఒకరోజులో కూడా ప్రభుత్వాలు పడిపోయిన సమయమది. ఒకరోజు నేను టీవీ చూస్తుంటే కళ్ల వెంట నీళ్లు వచ్చేశాయి.
వాజ్ పేయి లాంటి నాయకులు ఉంటే బాగుంటుందన్న ఆలోచనతో భాజపాలో ఇన్వాల్వ్ అయిపోయాను. ఫ్యాక్షన్ ఏరియాల్లో, నక్సల్ ఏరియాల్లో చురుకుగా ఆ పార్టీ కోసం పనిచేశా. బాగా రాజకీయాల్లో ఉండి ఫాలో అయ్యాను. ఆ తర్వాత మళ్లీ సినిమాలు నన్ను ఆహ్వానించాయి. సెకండ్ ఇన్నింగ్స్ లో ఎలాంటి పాత్ర చేయాలి అనుకున్నప్పుడు నాకు ఎస్వీ రంగారావు గారు ఆదర్శం కాబట్టి ఆయన్ని ఫాలో అయ్యాను. రాజకీయాలు , దాని స్వరూపాలు మారుతూనే ఉంటాయి. రాజకీయాలు, సినిమా అనే రెండు రోడ్లను ఫాలో అవుతూనే ఉంటాను. అప్పటి రాజకీయాలకు, ఇప్పటి రాజకీయాలకు చాలా తేడా ఉంటుంది.
* మళ్లీ ఏమైనా క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా?
అస్సలు ఇప్పట్లో రాను. ఏదైనా సినిమాతోనే చెబుతాను. నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు ఐడియాలజీ బేస్డ్ గానో, ప్రాజెక్ట్ బేస్డ్ గానో తిట్టుకునే వాళ్లం. ఇవాళ రాజకీయాలు ఒకళ్లని ఇంకొరు అసభ్య పదజాలంతో తిట్టుకునేలా మారాయి. ఆడవాళ్లు ఆడవాళ్లగా కాకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. స్వార్థ రాజకీయం బాగా పెరుగుతోంది. కొన్ని ప్రాంతాలు అంధకారంలోకి వెళతున్నాయా అనిపిస్తోంది. హిట్లర్ లాంటి వాళ్లను కూడా చూశాం. మంచి వాళ్లనూ చూశాం. రాజకీయం చెడ్డదని చెప్పను. మనది గ్రేటెస్ట్ ప్రజాస్వామ్యం. ఇంకో పక్క రాజకీయాలను డబ్బు శాసిస్తోంది. ఎంపీగా పోటీ చేయాలంటే 100 కోట్లు కావాలి.
పంచాయితీకి పోటీ చేయాలంటే రెండు కోట్లు కావాలి. ఒకప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి యాభై లక్షల్లో అయిపోయేది. ఈ రోజున ఎన్నికల్లో 100 కోట్లు ఖర్చు పెట్టే వ్యక్తి దాన్ని మళ్లీ రాబట్టుకోవాలి. ఆ డబ్బును ప్రజల నుంచి మళ్లీ రాబట్టుకోవాలి. ఇదొక విషవలయం. ఇంకో గవర్నమెంటు రాగానే ఇతను జైల్లోకి పోతాడు. ఆ తర్వాత మళ్లీ గవర్నమెంటు మారి వాళ్లు జైల్లోకి పోతారు. ఇలా జైలు, బెయిలు రాజకీయమే నడుస్తోంది. ఇదే జీవితం అంటే కరెక్ట్ కాదు. వ్యక్తిగత కసితో రాజీకీయం నడపడం కరెక్ట్ కాదు. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కూడా నాయకులంతా జైల్లో ఉన్నారు. ప్రజలు పోరాడారు. సినిమా అనేది గొప్ప మాధ్యమం. దేన్నయినా ఈ మాధ్యమంతో కన్వే చేయవచ్చు. కృష్ణగారి సమయంలో కూడా ఈనాడు, సాహసమే నా ఊపరి, నా పిలుపే ప్రభంజనం, మండలాధీశుడు లాంటి సినిమాలతో దమ్ముతో తీశారు. అలాగే ఆయన రాజకీయాల్లోకి కూడా వెళ్లారు.
సినిమా అనేది రాజకీయాలకు బాణం లాంటిది. దాని ద్వారా చాలా చెప్పవచ్చు. సినిమా నుంచి ఎంతోమంది ప్రెసిడెంట్లను చూశాం. రోనాల్డ్ రీగన్,ఎన్టీ రామారావు లాంటి వారే ఉదాహరణ. తెలుగువాడికి ఓ గౌరవాన్ని తెచ్చిన నాయకులు సినిమా రంగం నుంచే వెళ్లారు. ఇప్పుడు కూడా పవన్ కల్యాణ్ లాంటి వారు పోరాడుతున్నారు. ఇలా మాట్లాడుతున్నానని ఎవరికీ మద్దతు ఇస్తున్నానని కాదు. సినిమా అనేది మంచి ఆయుధం. అలాంటి వారికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. నార్త్ లో కూడా చాలా మంది హీరోలు రాజకీయాల్లోకి వెళ్లారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టేలా ఈ సినిమా ఉంటుంది. మన కళ్ల ముందు కనబడే నగ్నసత్యాన్ని ఇందులో ఆవిష్కరించారు. అదేంటనేది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. ఒక మంచి మెసేజ్ లో నాకు భాగం దక్కడం నా అదృష్టం.
* జైలు, బెయిలు అనే మాటలు వాడారు కదా.. చంద్రబాబు అరెస్ట్ విషయంలో మా కామెంట్ ఏంటి?
నేను ఒక లీడర్ గురించి మాట్లాడటం లేదు. ఏది న్యాయం? ఏది ధర్మం అనేది సినిమాలో చెప్పాం. ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది. వ్యక్తిగత కక్షతో, అణచివేత ధోరణితో ఎవర్ని అయినా బంధించడం ప్రజాస్వామ్యంలో ఒక తిరుగుబాటును సూచిస్తుంది. ఆ తిరుగుబాటు రిజల్ట్ ఓటు రూపంలో వస్తుంది.. అది మనం చూస్తాం. ఇందాకే చెప్పాను ఎమర్జెన్సీ గురించి.. అది నల్ల మచ్చగా మిగిలిపోయింది. అల్టిమేట్ గా ఏంటంటే రాజకీయ వారసులు రావడం అన్నది తప్పు రైటు అని నేను అనను. నువ్వు కరెక్ట్ గా చేస్తే దాని విలువ దానికి ఉంటుంది. ఇవాళ డబ్బుకీ రాజకీయానికీ చాలా చిక్కుముడులు పడిపోయాయి. ఈ ముడి విప్పాలి. దీని కోసం పవన్ కళ్యాణ్ గారు పోరాడుతున్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి ఇలాంటి పోరాటం సాగడాన్ని గర్విస్తున్నా.
* చంద్రబాబు అరెస్టు తర్వాత సినిమా వాళ్లు మౌనంగా ఉన్నారెందుకు?
సినీ పరిశ్రమ ఎప్పుడూ ప్రజా సంక్షేమం వైపే ఉంటుంది. ఎన్టీఆర్, కృష్ణ గారి టైమ్ లో కూడా వరదల్లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు జోలెపట్టుకుని డబ్బు సేకరించి ప్రజల్ని ఆదుకున్నారు. వారి డబ్బును కూడా ప్రజల కోసం వెచ్చించారు. రామారావు గారి ఆదేశాల మేరకు నేను, బాలకృష్ణ కూడా ప్రజల్లోకి వెళ్లాం. ప్రజలకు సమస్య వచ్చినప్పుడు సినీ పరిశ్రమ వారికి అండగా ఎప్పుడూ ఉంటుంది. దీనికి సమాధానం ప్రజలే చెప్పాలి. మేం కూడా ప్రజల్లోకే వస్తాం. ఇవాళ సైలెంట్ మార్పు జరుగుతోంది.
ఓటు అనే ఆయుధంతోనే దీనికి పరిష్కారం చూపుతారు. సినీ పరిశ్రమ సైలెంట్ ఉండటం వెనుక కారణం ఏదో ఉంటుంది. సొసైటీ నిశ్శబ్దంగా ఉందంటే ఒక తిరుగుబాటు కోసం వేచి చూస్తోందని అర్థం. నేను ఏ పార్టీని ఉద్ధేశించి మాట్లాడను. కింగ్ సినిమా కూడా దీనికి లింక్ అయి ఉంది. ఎన్నికల సమయంలో మన ఓటరు తీర్పు ఎప్పుడూ స్పష్టంగా ఉంటుంది. గత 50 ఏళ్లుగా మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఈసారి కూడా క్లియర్ మాండేట్ వస్తుంది.
* సినిమాల్లో సక్సెస్ కావాలంటే ఏం చెయ్యాలి?
నేను తొమ్మిదో ఏటనే సినిమాల్లోకి వచ్చాను. పండింటి కాపురంలో చిన్నప్పుడే నటించా. ఇప్పటికి 50 ఏళ్ల ప్రయాణం. హీరోగా నా మొదట సినిమా నాలుగు స్తాంభాలాట చేసేటప్పుడు నా వయసు 17. సినిమా అనేది ఒక జీవనది. అందులో మునిగిపోకుండా తేలుతూ వెళ్లాలి. దీనికి మంచి టాలెంట్ అవసరం. దాంతోపాటు మంచి క్రమశిక్షణ, పీఆర్.. ఇవి చాలా అవసరం. వీటితో పాటు అదృష్టం కూడా ఉండాలి. నా జీవితంలో కూడా అదృష్టం, దురదృష్టం రెండూ ఉన్నాయి. సినిమా వదిలి రాజకీల్లోకి వెళ్లి వెనక్కి వచ్చినప్పుడు నరేష్ అంటే ఎవరు అన్నావరు కూడా ఉన్నారు. అప్పుడు ఏంచెయ్యాలో కూడా నాకు అర్థం కాలేదు.
ఇవన్నీ దాటి వచ్చానంటే మొదట థ్యాంక్స్ చెప్పాల్సింది దేవుడికి. ఆ తర్వాత కృష్ణగారికి, విజయనిర్మల గారికి చెప్పాలి. అలాగే సీనియర్ దర్శకులకు, జూనియర్ దర్శకులకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. కళాకారుల్ని రాజులు గుర్తించి పోషించేవారు. ఇవాళ రాజులు లేరిక్కడ. సినిమా ఇండస్ట్రీ దాన్ని అదే పోషించుకుంటోంది. ఫిజికల్ గా, మెంటల్ నేను ఫిట్.. ఎన్ని యుద్దాలైనా తెరవెనుకే. తెరమీదికి వస్తే ఆ పాత్రలోనే ఉంటాను. నంది అవార్డులు లాంటి వాటిని పక్కన పెడితే నా దర్శకులు, రైటర్లు చెప్పా మాటలే నాకు పెద్ద అవార్డు.
– హేమసుందర్