భాగ్యనగరి హైదరాబాద్ కు ఇప్పుడు నిజంగానే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ) మణిహారమేనని చెప్పాలి. ఎందుకంటే… ఈ కాలేజీకి ప్రపంచ వ్యాప్తంగా విశ్వసనీయత కలిగిన కాలేజీగా గుర్తింపు ఉంది. టాప్ బిజినెస్ స్కూల్స్ లో ఒకటిగా నిలిచింది. కొన్ని అంశాల్లో అయితే దేశంలోనే నెంబర్ వన్ ప్లేస్ ను ఆక్రమించుకోవడంతో పాటు విశ్వవ్యాప్తంగా ఉన్న పలు కార్పొరేట్ కాలేజీకు ఏమాత్రం తగ్గకుండానే తనదైన శైలి ప్రతిభను చాటుతోంది. ఇందుకు నిదర్శనంగా ప్రస్తుత భారత దేశంలోని ఆర్థిక వ్యవస్థకు, పారిశ్రామిక వ్యవస్థకు ఇక్కడి విద్యభ్యసించిన వారే సలహాదారులుగా కొనసాగుతున్నారు.
హైదరాబాద్ లో ఐఎస్ బీ.. ఇంటరెస్టింగే
ఇక్కడిదాకా బాగానే ఉంది గానీ… అసలు ఈ సంస్ధ హైదరాబాద్ కు ఎలా వచ్చింది.ఐఎస్ బీని హైదరాబాద్ కు తీసుకొచ్చిన నేత ఎవరు? ఆ నేత ఏ మేర కష్టపడి మరీ ఈ సంస్థను హైదరాబాద్ లో నెలకొల్పారు? అన్న విషయాలు చాలా మందికి తెలియకపోవచ్చు. ఆ వివరాలు చాలా ఆసక్తికరమే కాదు… ఓ రాజకీయ నేత న రాష్ట్రానికి మంచి జరగాలని ఎంతగా తపించిపోయారన్న విషయం కూడా ఈ ఒక్క ఘటన తేల్చి చెబుతుంది. ఆ సందర్భంగా పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న వైనం కూడా మనలను ఆశ్చర్యానికి గురి చేయక మానవు. సరే మరి ఆ ఆసక్తి కలిగించే అంశాల్లోకి వెళ్లిపోదాం పదండి.
బిజినెస్ విద్యకు విదేశాలకెందుకు?
బిజినెస్ డిగ్రీలు చేయాలంటే… ఐఐఎంలు తప్పించి మన దేశంలో పెద్దగా పేరొందిన మేనేజ్ మెంట్ కాలేజీలే లేవు. అందుకే… మన దేశానికి చెందిన రాజకీయ నేతలు, ప్రసిద్ధ వ్యాపారవేత్తల కుమారులు నేరుగా విదేశాలకు వెళ్లి చదువుకుంటున్నారు. ఇకపై ఈ తరహా పరిస్థితి వద్దని, అందుకు ప్రత్యామ్నాయంగా దేశంలోనే ఓ ప్రసిద్ధ బిజినెస్ స్కూల్ ను ఏర్పాటు చేద్దామని భారత పారిశ్రామిక దిగ్గజాలు టాటా, బిర్లా, అంబానీ, ప్రేమజీ, రూయా, సింఘానియా భావించారు. అందులో భాగంగానే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ రూపకల్పన జరిగింది. వాస్తవంగా ఐఎస్బీని దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్న పారిశ్రామిక వ\దిగ్గజాలు.. దానిని బెంగుళూరులో దీన్ని నిర్మించాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని పెద్ద-పెద్ద పారిశ్రామికవేత్తలు నిర్ణయించుకున్నారు. అయితే దేశంలోనే కాకుండా ఇతర దేశాలకు సంబంధించిన కీలక పరిణామాలన్నింటిపైనా ఓ కన్నేసి ఉంచే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆ సమయంలో ఉమ్మడి రాష్టరానికి సీఎంగా ఉన్నారు. సాధారణంగా ఈ విషయం కూడా చంద్రబాబు చెవిన పడింది. భవిష్యత్తులో ఈ స్కూల్ ఏ రేంజికి వెళ్లిపోతుందన్న విషయం కూడా చంద్రబాబు ఇట్టే పసిగట్టేశారు.అదీ.. చంద్రబాబు విజన్ అంటే..!
Also Read ;-
చంద్రబాబు ఎంట్రీ
ఇంకేముంది.. వెనువెంటనే రంగంలోకి దిగిపోయారు. అనుకున్నదే తడవుగా టాటా, బిర్లా, అంబానీ, ప్రేమజీ, రూయా, సింఘానియాల బెంగళూరు టూర్ ఖరారు కాకముందే అల్పాహార విందుకు రమ్మంటూ ఆహ్వానించారు. ఈ క్రమంలో చంద్రబాబు అసలు ఉద్దేశమేమిటో గ్రహించిన పారిశ్రామికవేత్తలు చంద్రబాబు ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించారు. అయితే చంద్రబాబు అంత ఈజీగా దేనినీ వదిలిపెట్టరు కదా. ప్రముఖ పారిశ్రామికవేత్త, నాడు టీవీ9లో కీలక భాగస్వామిగా ఉన్న శ్రీనిరాజు (సత్యం రామలింగరాజు గారికి స్వయాన తోడల్లుడు)తో తనకున్న పరిచయాన్ని చంద్రబాబు ప్రయోగించారు. శ్రీనిరాజు ద్వారా ఆ పారిశ్రామిక దిగ్గజాలకు మరోమారు కబురు పెట్టారు. ఇక చంద్రబాబు వదలడనుకున్నారో, ఏమో తెలియదు గానీ… ముంబై నుండి బెంగుళూరుకు వెళుతున్న రూట్ లోనే మార్గమధ్యలో హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
పక్కా ప్రణాళికతో బాబు సిద్ధం
తన వాదనను వినేందుకు పారిశ్రామిక దిగ్గజాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న భావనతో పకడ్బందీగానే ప్రణాళిక రచించారు. పారిశ్రామిక దిగ్గజాల ముందు తన అధికార దర్పాన్ని ఏమాత్రం ప్రదర్శించకుండా, నేరుగా వారి వాహనాల వద్దకు వెళ్లిన చంద్రబాబు వారికి సాదరంగా ఆహ్వానం పలికారు. హైదరాబాద్ నగరాన్నిఐఎస్బీకి వేదికగా ఎంపిక చేసుకోమని, దానికి కావాల్సిన పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలనన్నింటిని తమ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని విన్నవించారు. అయితే అప్పటికే బెంగుళూరుకు నగరాన్ని ఎంపిక చేసుకున్న పారిశ్రామికవేత్తలు చంద్రబాబు ముందు ఆ విషయం చెప్పలేక ఏదో అలాఅలా అల్పాహార విందును ముగించుకుని నేరుగా బెంగళూరుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు,
బాబు మార్కు ఆతిథ్యానికి ఫిదా
ఇక్కడే చంద్రబాబు తనదైన మార్కు అస్త్రాన్ని ప్రయోగించారు. ఓ రాష్ట్రానికి సీఎంగా ఉండి కూడా కించిత్తు అసహనం చూపించకుండానే.. స్వాగతం పలికేముందు ఎంత మర్యాద ఇచ్చారో…అంతకంటే రెండింతల మర్యాదతోనే వారికి వీడ్కోలు పలికారు. ఆ పారిశ్రామిక దిగ్గజాలను వారి కార్ల వద్దకు వెళ్లి, వారు అందులో కూర్చునేవరకూ అక్కడే నిలబడి… ఎటువంటి బేషజం లేకుండా వారి కార్ల డోర్లు కూడా వేసి వేను తిరిగారు. చంద్రబాబు అతిథ్యానికి నిజంగానే ఆ పారిశ్రామికవేత్తలు ముగ్ధులయ్యారనే చెప్పాలి. అయితే ఈ విషయం వారికి బెంగళూరు వెళ్లాక గానీ అర్థం కాలేదు.
బెంగళూరు నుంచి నేరుగా హైదరాబాద్ కే
చంద్రబాబు నుంచి వీడ్కోలు తీసుకుని నేరుగా బెంగుళూరు చేరుకున్న వీరు.. తమకు కేటాయించిన సమయానికే నేరుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పాటిల్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడే ముఖ్యమంత్రి రాక కోసం వేచిచూస్తున్నారు. అయితే హైదరాబాద్ చేసుకున్న పుణ్యమో, చంద్రబాబు మహత్యమో తెలియదు గానీ… అనుకోని పరిస్థితుల్లో కర్ణాటక సీఎం పాటిల్ కు వేరే పనులు ఉండటంతో వీరిని ఏకంగా 3 గంటలు వేచి చూడాలని, ఆ తర్వాతే సీఎం అపాయింట్ మెంట్ అంటూ అక్కడి సిబ్బంది చెప్పారు. దీంతో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా శ్రీనిరాజుకు ఫోన్ చేసిన ఆ దిగ్గజాలు చంద్రబాబు తో సమావేశానికి ఏర్పాట్లు చేయమని కోరారు. వెరసి… బెంగుళూరులో అనుకున్న ఐఎస్బీ… చంద్రబాబు మార్కు రాయబారంతో హైదరాబాద్ లోయ ఏర్పాటైంది. భాగ్యనగరి సిగలో మణిహారంగా మారింది.
Must Read ;- నడిచే లైబ్రరి,పోరాటమే ఊపిరి.. విజన్ ఉన్న నేత చంద్రబాబు