2020 మొత్తం కరోనార్పణం అయిపోయింది. కనీసం 2021 సంవత్సమైనా బాగుంటుందని ఆశించడం అత్యాశలా ఉంది. బ్రిటన్, దక్షిణాఫ్రికాలో కొత్తరకం కరోనా స్ట్రెయిన్‌లతో కొత్త సంవత్సరాన్ని స్వాగతించాల్సి వచ్చింది. కరోనా స్ట్రెయిన్స్ ఇకనైనా ఆగితే చాలనుకుంటున్నారు ప్రజలు. కానీ, అది కూడా నెరవేరేలా లేదు. కొత్తరకం వైరస్ అగ్రరాజ్యంలో వెలుగుచూసినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. ఇది బ్రిటన్ స్ట్రెయిన్ కన్నా 50% వేగవంతంగా విస్తరిస్తున్నట్టు చెప్పడం మరింత ఆందోళన కలిగిస్తున్న విషయం.
బ్రిటన్, దక్షిణాఫ్రికా కొత్త రకం కరోనా స్ట్రెయిన్స్‌ను తలదన్నే విధంగా కొత్తరకం కరోనా వైరస్ అమెరికాలో కాలుమోపింది. ఈ విషయాన్ని అక్కడి టాస్క్ ఫోర్స్ అధికారులు తెలియజేశారు. గత వసంత, వేసవి మాసాల్లో నమోదైన కరోనా కేసుల కంటే ఇటీవల ఎక్కువగా ఉందని టాస్క్ ఫోర్స్ పేర్కొన్నది. గత 24 గంటల్లో 2.9 లక్షల కొత్త కరోనా కేసులు నమోద య్యాయి. శుక్రవారం ఒక్కరోజే 3,676 మంది కరోనాతో చనిపోయారు. వైరస్ రూపాంతరం చెంది ఉంటుందని, ఇప్పటికే ప్రజలకు ఇది వ్యాపించిందని వెల్లడించింది. దేశవ్యాప్తంగా 90 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్టు నేషనల్ హెల్త్ కమిషన్ అధికారులు తెలిపారు.
Must Read ;- ఏమిటీ ‘X’ వ్యాధి? ఇది మరో కరోనా కాబోతుందా?