సినిమా హీరో అంటేనే ఓ రేంజ్. ఆ రేంజ్ కి తగ్గ కారుంటేనే అందం చందం. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి కొన్న విదేశీ కారు చూడముచ్చటగా ఉండేది. ఇప్పటికీ ఆ కారు చిరంజీవి దగ్గరే ఉన్నా అది బయటికి వచ్చిన సందర్భాలు అరుదు. హీరో నాగ శౌర్యకు కూడా కారులంటే భలే మోజు. వీరంతా కారులో ‘షి’కారుకు వెళ్లే తీరక ఉంటుందో లేదోగానీ ఆ మోజు మాత్రం తీర్చుకుంటూ ఉంటారు. తాజాగా యువ హీరో నిఖిల్ కూడా ఆ రేంజ్ నే కోరుకుంటున్నాడు. చూశారా ఈ రేంజ్ రోవర్ కారుతో ఎలా పోజిచ్చాడో.
ఈ స్పోర్ట్ ఆటో బయోగ్రఫీ తో ఇలా మనముందుకు వచ్చాడు. కోవిడ్ టైమ్ లో ఓ ఇంటివాడైన నిఖిల్ త్వరలో తండ్రి కూడా కాబోతున్నాడట. కూతురు పుడితే మాయ అనే పేరు పెడతాడట. ఈ విషయాన్ని ఆలీతో జరిగిన ఓ కర్యక్రమంలో వెల్లడించాడు. మరి కొడుకు పుడితే ‘మాయలోడు’ అని పెడతావా అంటూ అలీ సెటైర్ కూడా వేశాడనుకోండి. మరి సినిమాల పరంగా నిఖిల్ ఏం మాయ చేయబోతున్నాడో చూడాలి.
Must Read ;- మెగాస్టార్ తో ఆ నలుగురు కెప్టెన్లు











