ఫోర్బ్స్ విడుదల చేసిన ‘అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితా-2020’ లో పలువురు భారతీయ వనితలకు స్థానం దక్కింది. అందులో రాజకీయ నాయకురాలు నిర్మలా సీతారామన్ కు చోటు దక్కింది. ఈమెతో పాటు హెచ్ సీ ఎల్ డైరెక్టర్ రోషిణి నాడార్, బయోకాన్ వ్యవస్ధాపకురాలు కిరణ్ మజుందర్ షా కు చోటు దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా 100 మంది మహిళలను ఎంపిక చేయగా, 3 భారతీయ మహిళలు చోటు దక్కించుకున్నారు.
10 ఏళ్లగా నెంబర్:1
జర్మని ఛాన్సలర్ ఏంజెలా మర్కెల్ 10 సంవత్సరాల నుండి వరసగా ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో మొదటి స్ధానం దక్కంచుకుంటున్నారు. ఈ ఏడాది కూడా నెంబర్:1 స్ధానాన్ని సుస్థితం చేసుకున్నారు. ఐరోపా సెంట్రల్ బ్యాంక్ అధినేత క్రిస్టిన్ లగార్డే రెండో స్ధానంలో నిలచారు. అగ్రరాజ్యనికి మొదటిసారిగా మహిళ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన, భారతీయ మూలాలు కలిగి కమలా హ్యారిస్ మూడో స్థానంలో నిలిచి అందరి మన్ననలు అందుకున్నారు.
41వ స్థానం
2020 సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా 100 మందిని ఎంపిక చేసిన ఈ జాబితాలో ముగ్గురు భారతీయ మహిళలకు స్థానం దక్కింది. పురుష్యాధిక్య రాజకీయ రంగంలో ఇటీవలి కాలంలో తనదైన ముద్రవేసి రక్షణ మంత్రిగా, ఆర్ధిక మంత్రిగా ఎంపికై సంచలనాన్ని నమోదు చేశారు. కేవలం ఎంపికవడం కాదు, అందులో తనదైన శైలిని కనబరుస్తూ పూర్తిస్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్న మొట్టమొదటి మహిళగా చరిత్రకెక్కారు. ఆమె ఘనతకు గుర్తుగా ఫోర్బ్స పవర్ ఫుల్ ఉమెన్-100 లో 41వ స్ధానంలో నిలిచారు.
మరో ఇద్దరికి దక్కిన గౌరవం
కోటక్ వెల్త్ హురున్ లీడింగ్ వెల్త్ ఉమెన్ 2020 జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకున్న హెచ్ సీఎల్ డైరెక్టర్ రోషిణి నాడార్ మల్హోత్రా, ఫోర్బ్స్ పవర్ ఫుల్ ఉమెన్ గా ఎంపికయ్యారు. 2017 నుండి ఫోర్బ్స్ జాబితాలో స్థానాన్ని దక్కించుకుంటున్నారీ యువ వ్యాపారవేత్త. ఇక మరొకరి విషయానికొస్తే, బయోకాన్ ఛైర్ పర్సన్ కిరణ్ మజుందర్ షా కూడా ఫోర్బ్స్ లిస్ట్ లో పేరు నమోదు చేసుకున్నారు. 2019 లో కూడా ఫోర్బ్స్ జాబితాలో 65వ స్ధానంలో నిలిచిందీ బయోకాన్ వ్యవస్థాపకురాలు. 2020 లో కూడా తిరిగి భారతదేశం తరపున అత్యంత శక్తివంతమైన మహిళగా నిలిచి మహిళా శక్తిని మరొకసారి చాటి చెప్పింది.
Must Read ;- ఈమె ఇండియాలోనే అత్యంత సంపన్నురాలు
See who else made this year's #PowerWomen list: https://t.co/KqYLi4gj5s pic.twitter.com/IYioOOe7Rc
— Forbes (@Forbes) December 8, 2020
మహిళా శక్తి అనంతం.. వారు అడుగిడని రంగం.. వారికి సాధ్యం కాని పనంటూ ఉండదేమో. వచ్చే ఏడాదికి భారతదేశం నుంచి ఇంకా ఎందరో శక్తివంతమైన మహిళలుగా ఎదిగాలని కోరుకుందాం. భారతీయ మహిళా శక్తి ప్రపంచానికి చాటి చెబుదాం.
Also Read ;- ఫోర్బ్స్ ’30 అండర్ 30’ లో చోటు దక్కించుకున్న నల్గొండ యువకుడు