బడ్జెట్ 2021ని తన ప్రసంగంతో పార్లమెంట్లో ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. కరోనా కారణంగా ఈ ఏడాది బడ్జెట్ ప్రతుల ముద్రణ లేకుండానే బడ్జెట్‌ని కేంద్రం ప్రవేశపెట్టింది. ల్యాప్ టాప్ ద్వరా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రిగా సీతారామన్‌కు ఇది మూడో బడ్జెట్. మోడీ ప్రభుత్వానికి ఇది 9వ బడ్జెట్. ప్రతిపక్షాల నిరసనల మధ్య డిజిటల్ బడ్జెట్‌కు శ్రీకారం చుట్టిన సీతారామన్. రైతు చట్టాలు రద్దు చేయాలంటూ ప్రతిపక్షాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వారి నిరసనలను లెక్కచేయకుండా సీతారామన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఎంపీలకు డిజిటల్ కాపీ పంపిణీ చేసిన కేంద్రం. సామాన్య ప్రజల కోసం ఫైనాన్స్ మినిస్ట్రీ యాప్ ద్వారా బడ్జెట్ వివరాలు అందుబాటులోకి తెచ్చింది కేంద్రం.
కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ వల్ల దేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చింది. కనివినీ ఎరుగని పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి వస్తుంది. ప్రపంచ యుద్ధాల తర్వత కొత్త పరిస్థితులను ఎదుర్కొన్నట్లుగా.. కరోనా తర్వాత మరో సరికొత్త ప్రపంచాన్ని చూస్తున్నాం. ఈ దేశం మూలాల్లోనే ఆత్మనిర్భార్ భారత్ ఉంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే.. భారత్‌లో మరణాల రేటు చాలా తక్కువనే చెప్పాలి. ఆరోగ్యవంతమైన భారత్ కోసం ప్రభుత్వ ఎన్నటికీ కృష్టి చేస్తుంది. ఈ దిశగా బడ్జెట్-21 మరింత తోడ్పడుతుంది.
ఆరు మూల స్తంభాలమీద 2021 బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అందులో మొదటి స్తంభం ఆరోగ్యమని సీతారామన్ వ్యాఖ్యానించారు. రెండోది మౌలిక రంగం. మరో ప్రాధాన అంశం పాలనా సంస్కరణలు.
Must Read ;- బడ్జెట్ ప్రభావం.. ఏవి ప్రియం? వేటిపై తగ్గుదల?
- వైద్య రంగానికి 64,180 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు
- పిఎం ఆత్మ నిర్భర్ భారత్ స్వస్ధ్ యోజనకు 64 వేల కోట్లతో శ్రీకారం.
- కరోనా వ్యాక్సిన్ కోసం 35 వేల కోట్లు కేటాయింపు.
- పౌష్టికాహారం అందరికీ అందడానికి మిషన్ పోషణ్ 2.0 ప్రవేశపెట్టారు.
- అర్బన్ స్వచ్ఛభారత్ మిషన్ 2.0కు 1,41,000 కోట్లు కేటాయింపు.
- కొత్తగా బీఎస్ ఎల్-3 స్థాయి ప్రయోగశాలల ప్రారంభానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్.
- కేపిటల్ వ్యయానికి 5.54 లక్షల కోట్లు కేటాయింపు.
- దేశంలోని నాలుగు ప్రాంతాల్లో వైరాలజీ ల్యాబ్స్.
- రక్షిత మంచి నీటి పథకానికి 87 వేల కోట్లు కేటాయింపు.
- మెగా టెక్స్టైల్ ఇన్వెస్ట్మెంట్ పార్కలు ఏర్పాటు. మూడేళ్లలో ఏడు టెక్స్ టైల్ పార్కులు ఏర్పాటు చేయడమే ధ్యేయం.
- 87 లక్షల కోట్లతో జల్ జీవన్ పథకం ఏర్పాటు.
- స్వచ్ఛ భారత్ మిషన్ కొనసాగించడానికి 1,41,678 కోట్లు కేటాయించిన కేంద్రం.
- హెల్తకేర్కు 2 లక్షల కోట్లు కేటాయింపు. ప్రతి జిల్లాలో సమగ్ర హెల్త్ ల్యాబ్.
- వాయు కాలుష్య నివారణకు 2,217 కోట్లను కేటాయించిన కేంద్రం.
- రహదారుల విస్తరణ కోసం కొత్త ఎకనమికల్ కారిడార్ల ఏర్పాటు. 11 వందల కిలోమీటర్ల నేషనల్ హైవే కారిడార్ పూర్తి చేయడానికి ఏర్పాట్లు. అసోం, కేరళ, బెంగాల్ లలో జాతీయ రహదారుల అభివృద్ధి. బెంగాల్ 675 కి.మీ జాతీయ రహదారి అభివృద్ధి. తమిళనాడులో 3500 కి.మీ హైవే కారిడార్. 5 ప్రత్యేక జాతీయ రహదారుల అభివృద్థకి 5వేల కోట్లు కేటాయించిన కేంద్రం. మార్చి 22కు 8,500 కి.మీ అదనపు హైవేలు పూర్తి చేయడమే లక్ష్యం. భారత్ మాల కింద 13 వేల కి.మీ జాతీయ రహదారుల అభివృద్ధి.
- మెట్రో నిర్వహణను తగ్గించేందుకు రెండు అదనపు సర్వీసులు ఏర్పాటు. మెట్రో లైట్, మెట్రో న్యూ పేరుతో కొత్త ప్రాజెక్టులు ఏర్పాటు. బెంగుళూరు మెట్రో విస్తరణకు 14 వేల 700 కోట్లు కేటాయింపు. కోచి, చెన్నై, బెంగళూరు, నాగ్ పూర్, పుణె మెట్రో ప్రాజెక్టులు విస్తరణ. చెన్నై మెట్రో విస్తరణకు 63 వేల కోట్లు కేటాయింపు.
- ఈ ఏడాది రైల్వేకు 1.15 లక్షల కోట్లు కేటాయింపు.2023 నాటికి రైల్వే లైన్లు విద్యుదీకరణ పూర్తి చేస్తామన్న ప్రభుత్వం. ఖరగ్ పూర్-విజయవాడ మధ్య ఈస్ట్ కోస్ట్ సరకు రవాణా కారిడార్ ఏర్పాటు.
- 20 ఏళ్లు దాటిన వ్యక్తగత వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు తప్పనిసరి. కమర్షియల్ వాహనాలకు 15 ఏళ్ల తర్వాత ఫిట్నెస్ పరీక్షలు. ఫిబ్రవరి 15 నుంచి అన్ని వాహనాలకు తప్పనిసరిగా ఫాస్టాగ్ ఉండాలి.
- విద్యుత్ రంగానికి 3.05 లక్షల కోట్లను కేటాయించిన కేంద్రం. పీపీఏ పద్దతి ద్వారా 2,200 కోట్ల ఏడు కొత్త ప్రాజెక్టుల ఏర్పాటు.
- విదేశీ రంగ పెట్టుబడుల పరిమితిని 49 నుండి ఏకంగా 74 శాతానికి పెంచిన కేంద్రం. బీమా కంపెనీలను విదేశీ నడిపించే అవకాశాన్ని కల్పిస్తున్న కేంద్రం. ఆర్థిక సంస్థల అభివృద్థికి 10 వేల కోట్లు.
- పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంతో, 2 వేల కోట్లకు మించిన విలువతో 7 కొత్త ఓడరేవుల నిర్మాణం. కొత్తగా 5 షిప్పింగ్ హార్బర్లు ఏర్పాటు.
- బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న కేంద్రం. ఎన్పీఏలు, మొండి బకాయిలు బ్యాడ్ బ్యాంకింక్ తరలింపు. బ్యాంకు ఖాతాలు సజావుగా నిర్వహించేందుకు చర్యలు చేపడతామని కేంద్రం ప్రకటించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు 20 వేల కోట్ల నిధులు కేటాయింపు. ఈ బడ్జెట్లోనే ఎల్.ఐ.సి పబ్లిక్ ఇష్యూ పూర్తి చేయాలని నిర్ణయం. పబ్లిక్ రంగ బ్యాంకుల రీ క్యాపిటలైజేషన్ కోసం 20 వేల కోట్లు ఏర్పాటు.
- రీచర్చ్ అండ్ డెవలెప్ మెంట్‌కు 5 వేల కోట్లు కేటాయించిన కేంద్రం. 8 కోట్ల మందికి ఉచిత గ్యాస్. మరో కోటి మందికి ఉజ్వల స్కీం కింద గ్యాస్ కనెక్షన్లు. మరో వచ్చే మూడేళ్లలో 100 జిల్లాలకు గ్యాస్ పైప్ లైన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం.
- ఈ ఏడాది (2021-22) పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం 75 వేల కోట్లు. గెయిల్, ఐవోసీ, హెచ్‌పీసీఎల్, ఐడిబీఏలో పెట్టుబడులు ఉపసంహరించుకోనున్న కేంద్రం.
- రైతుల పంటలకు మద్దతు ధర అందించడానికి ప్రభుత్వం బడ్జెట్ కేటాయించింది. కనీస మద్దతు ధర కోసం 1,72,000 వేల కోట్లు కేటాయింపు. వ్యవసాయ రుణాలకు 16.5 లక్షల కోట్లు కేటాయింపు. 40 వేల కోట్లతో గ్రామీణ మౌలిక సదుపాయాల నిధి ఏర్పాటు.
- స్కిల్ డెవలెప్మెంట్కు 3 వేల కోట్లు కేటాయింపు. సౌర శక్తి రంగానికి 1,000 కోట్లు కేటాయింపు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 15 వేల 700 కోట్ల కేటాయింపు.
- ఎన్ ఈపీ కింద దేశంలో 15 వేల కోట్ల పాఠశాలలు అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణియించింది. కొత్తగా ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు. ఆదివాసీ ప్రాంతంలో మరో 750 ఏకలవ్య స్కూల్స్ ఏర్పాటు. కొత్తగా వంద సైనిక పాఠశాలలు. లేహ్‌లో సెంట్రల్ యూనివర్శిటీ.
- ఎయిర్ పోర్టుల ప్రైవేటీకరణ.
- పన్ను చెల్లింపు సరళీకరణకు మరిన్ని ఏర్పాట్లు. పెన్షన్లపై ఆధారపడిన సీనియర్ సిటిజన్లకు రిటర్న్ ఫైలింగ్ నుంచి మినహాయింపు. డివిడెండ్లపై ఇక నుంచి అడ్వాన్స్ ట్యాక్స్ ఉండదు. గృహ రుణాలపై వడ్డీ రాయితీ 2022 మార్చి వరకూ పొడిగించిన కేంద్రం. ఎన్నారైలకు డబుల్ ట్యాక్షేషన్ నుంచి ఊరట.
2020-21 ఆర్థిక ద్రవ్యలోటు 9.5 శాతం. 2021 బడ్జెట్లో ఆరోగ్యానకి పెద్దపీట వేసిన కేంద్రం. గతేడాదితో పోలిస్తే ఈ బడ్జెట్లో ఆరోగ్యం కోసం 13.7 శాతం ఎక్కువ బడ్జెట్‌ను కేటాయించిన ప్రభుత్వం. మూలధన వ్యయం బాగా పెంచిన కేంద్రం.
Must Read ;- వావ్.. చిప్పచేతికిచ్చారు.. కృతజ్ఞతలు జగన్ గారు..!