Nithya Menen Next Movie With Pawan Kalyan :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – పాన్ ఇండియా స్టార్ రానా కాంబినేషన్ లో అయ్యప్పనుమ్ కోషియమ్ తెలుగు రీమేక్ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుంటే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రిన్ ప్లే – సంభాషణలు అందిస్తుండడం విశేషం. ఇప్పటివరకు కొంత టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. యువ నిర్మాత నాగవంశీ ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో రానా దగ్గుబాటి సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తుంది. అయితే.. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ సరసన నటించే హీరోయిన్ ఎవరు అనేది ప్రకటించలేదు. ఫిదా బ్యూటీ సాయిపల్లవి పేరు వినిపించింది. అయితే.. డేట్స్ అడ్జెట్స్ కాకపోవడంతో ఆమె ఈ సినిమాకి నో చెప్పిందని తెలిసింది. తాజా సమాచారం ప్రకారం.. నిత్యామీనన్ నటిస్తుంది. జులై 12 నుంచి నిత్యామీనన్ ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ కానుంది. జులై 13 నుంచి పవన్ కళ్యాణ్ ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ కానున్నారు. వీరిద్దరి పై కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ టైమ్ వీరిద్దరు కలిసి నటిస్తున్నారు.
పవన్ – రానా ఫస్ట్ టైమ్ కలిసి నటిస్తుండడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రేజీ మూవీని సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు అయితే.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడింది. దీంతో ఈ క్రేజీ మూవీ సెప్టెంబర్ లో కాకుండా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
Must Read ;- పవర్ స్టార్ కోసం స్టోరీ రాసిన బాహుబలి విజయేంద్రప్రసాద్











