పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దగ్గుబాటి రానా మరో ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ సినిమా కొద్ది రోజుల ముందే రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించింది. రానా , పవన్ మీద కొన్ని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సంభాషణలు, స్ర్కీన్ ప్లే అందిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఇందులో పవర్ స్టార్ సరసన కథానాయికగా నిత్యా మీనన్ ను ఖాయం చేశారట. నిజానికి ఆ పాత్ర లో సాయిపల్లవి నటించాల్సింది. అయితే.. ఆమె కి కాల్షీట్స్ సమస్య రావడంతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దాంతో త్రివిక్రమ్ సలహాతో నిత్యామీనన్ ను పవర్ స్టార్ సరసన కథానాయికగా తీసుకున్నారని సమాచారం. నిత్యామీనన్ త్రివిక్రమ్ సన్నాఫ్ సత్యమూర్తిలో సెకండ్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఆ క్రెడిట్ తోనే త్రివిక్రమ్ ఆమెను ఈ సినిమాకి రికమెండ్ చేశాడట.
వాస్తవానికి ఒరిజినల్ వెర్షన్ లో బిజుమీనన్ భార్య.. ఓ మావోయిస్ట్. అతడు కూడా గిరిజనుడు కాబట్టి.. పోలీస్ అయినప్పటికీ ఆమెకు జీవితాన్నిస్తాడు. మరి తెలుగు వెర్షన్ లో నిత్యమీనన్ చేయబోయేది అదే పాత్రా లేక త్రివిక్రమ్ ఏదైనా మార్పులు చేశాడా అన్న విషయాలు ఇంకా తెలియవు. ఒక వేళ ఒరిజినల్ కేరక్టరే అయినా.. నిత్యామీనన్ ఆ పాత్ర ను అవలీలగా పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇందులో రానా సరసన ఐశ్వర్యా రాజేశ్ కథానాయికగా నటిస్తోందట. అలాగే… రానా తండ్రిగా కీలకమైన పాత్రలో తమిళ నటుడు సముద్ర ఖని చేస్తున్నాడు. మరి పవర్ స్టార్ భార్యగా నిత్యామీనన్ ఏ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇస్తుందో చూడాలి.