డ్యాన్సుల్లేని చిరంజీవి సినిమాను అసలు ఊహించగలమా? అసలు ఆయన డ్యాన్సులు చేయకపోతే.. అభిమానులు ఊరుకుంటారా? నిజమేనండీ.. ఆయన తదుపరి చిత్రంలో అసలు హీరోయినే ఉండదనే వార్తలొస్తున్నాయి. అందుకే అందులో ఆయన డ్యాన్సులుండవని అంటున్నారు. నిజానిజాలేంటో తెలియకపోయినప్పటికీ.. ప్రస్తుతం ఈ వార్త అభిమానుల్ని కాస్తంత నిరాశకు గురిచేస్తోంది.
మోహన్ లాల్ హీరోగా నటించిన సూపర్ హిట్ మలయాళ సినిమా ‘లూసిఫర్’ కథాంశం ఎంతగానో నచ్చి చిరంజీవి ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి సిద్ధమయ్యారు. రామ్ చరణ్ లూసిఫర్ రీమేక్ రైట్స్ ను ఎప్పుడో కొనుగోలు చేశాడు. అయితే ఈ సినిమాకి దర్శకుడిగా ముందుగా సుజిత్ పేరు వినిపించింది. తెలుగు నేటివిటీకి అనుగుణంగా స్ర్కిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసి.. ఎందుకోగానీ.. సుజిత్ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత వివి వినాయక్ పేరు వినిపించింది. కొంత కాలం ట్రావెల్ చేసి ఆయన కూడా పక్కకు తప్పుకున్నాడు. ఇప్పుడు ఆయన ప్లేస్ లో తమిళ దర్శకుడు మోహన్ రాజా వచ్చిచేరాడని అంటున్నారు.
నిజానికి లూసిఫర్ మలయాళ మూవీలో మోహన్ లాల్ సరసన హీరోయిన్ ఉండదు. ఆ కథలో ఆ అవసరం లేకపోవడంతో.. ఆయనకి హీరోయిన్ సమస్యేమి రాలేదు. అయితే తెలుగు వెర్షన్ లో చిరంజీవి హీరో కాబట్టి.. డ్యాన్సుల కోసమైనా హీరోయిన్ ఉండి తీరాలి. అందుకే ముందు తెలుగు వెర్షన్ లో హీరోయిన్ పాత్రను క్రియేట్ చేయాలనుకున్నారు . కానీ తాజా సమాచారం చిరంజీవి పాత్రలో కొన్ని మార్పులు తప్ప.. వేరే ఛేంజెస్ ఏమీ ఉండవని తెలుస్తోంది. అంటే.. ఈ సినిమాలో చిరు సరసన హీరోయిన్ ఉండదన్నమాట. మరి హీరోయిన్ లేని లూసిఫర్ తెలుగు వెర్షన్ ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
Must Read ;- ఆ భారీ సెట్ ఎందులకు ‘ఆచార్య’ దేవా.. ?