తెలంగాణలో రేపటి నుంచి లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను పరిశీలించి ఈ మేరకు లాక్డౌన్ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినెట్ ఆదేశించింది. రేపటి నుంచి అన్ని వ్యాపార, వాణిజ్య కార్యక్రమాలు యథావిదిగా సాగనున్నాయి.
Must Read ;- దేశంలో 60 వేలకు తగ్గిన కరోనా కేసులు
లాక్ డౌన్ ను సంపూర్ణంగా ఎత్తివేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను పరిశీలించి ఈ మేరకు లాక్ డౌన్ ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నది.
— Telangana CMO (@TelanganaCMO) June 19, 2021