ప్రత్యర్దులు నీతులు పాటించాలి.. మేము మాత్రం అక్రమాలు చేసి బూతులు తిడతాం.. ఆధారాల్లేని ఆరోపణలతో బురద జల్లుతామంటున్నారు వైసీపీ నాయకులు. కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీపై తప్పుడు ప్రచారాలతో ప్రజల చెవుల్లో పూలు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మొదట పేపర్ లీక్ అన్నారు.. డీఎస్సీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్.. పేపర్లు ఉండవని తెలిశాక.. ఆ వాదన వదిలేశారు.
పేకాట ఆడిన వాళ్లకు టీచర్ ఉద్యోగాలు ఇచ్చారని మరో అబద్దం చెప్పారు. బ్రిడ్జి గేమ్ పేకాట కాదని.. ఆ కోటాలో ఎవరికీ జాబ్ ఇవ్వలేదని అధికారులు స్పష్టం చేయడంతో.. ఆ విషయంలోనూ అన్నీ మూసుకోవాల్సి వచ్చింది. ఒకే సామాజిక వర్గానికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలన్నీ ఇచ్చేశారని మరో ఫేక్ స్టోరీ క్రియేట్ చేశారు. కానీ స్పోర్ట్స్ కోటాలో 90 శాతం ఉద్యోగాలు బీసీ,ఎస్సీ, ఎస్టీలకే దక్కాయని ప్రభుత్వం పూర్తి వివరాలు బయటపెట్డంతో.. ఆ వాదన కూడా వీగిపోయింది.
వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలన్నీ అబద్దాలే అని తేలిపోయినా.. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని.. వైసీపీ అధినేత జగన్ పదే పదే డిమాండ్ చేస్తున్నారు. ఫేక్ ఆరోపణలకే లోకేశ్ రాజీనామా చేయాలంటే.. వైసీపీ హయాంలో నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్షల్లో భారీ అక్రమాలు జరిగాయని కోర్టులో ఆధారాలతో సహా రుజువైంది. మరి గ్రూప్ వన్ అక్రమాలకు బాధ్యత తీసుకొని వైసీపీ అధినేత జగన్.. తన ఎమ్మెల్యే పదవితో.. వైసీపీ అధ్యక్షుడి స్థానానికి రాజీనామా చేసి.. నైతికత నిరూపించుకొంటారా అంటే.. అబ్బే అలాంటి అలవాట్లు మా ఇంట్లో, ఒంట్లో లేనే లేవంటారు.
వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్ సోదరుడు, కడప ఎంపీ.. అవినాశ్‌రెడ్డి ప్రధాన నిందితుడని సీబీఐ ఛార్జ్‌షీట్‌లో తెలిపింది. హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న అవినాశ్‌రెడ్డి కడప ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా అంటే అదీ చేయరు. కానీ డీఎస్సీలో జరగని అక్రమాలకు లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడానికి మాత్రం జగన్ అండ్ కో ముందుంటారు. డీఎస్సీపై చర్చకు రావాలని లోకేశ్ మళ్లీ మళ్లీ సవాల్ చేసినా.. ఓపెన్ డిబేట్లో పాల్గొనడానికి జగన్ సాహసం చేయలేకపోతున్నారు. వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో నిజమెంత అనేది.. లోకేశ్‌తో చర్చకు జగన్ వెనకడుగు వేయడంతోనే అర్ధమైపోతుంది. ఆరోపణల్లో పస లేనప్పుడు.. డిమాండ్లలో న్యాయం లేనప్పుడే.. మీడియా వెనుక, కుహాన మేధావుల వెనుక దాక్కొని.. తప్పుడు ప్రచారాలు చేస్తూ.. బురద జల్లుతారని వైసీపీ నాయకుల డీఎస్సీ కుట్రలు స్పష్టం చేస్తున్నాయి











