పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘వకీల్ సాబ్’. ‘యం.సి.ఏ’ ఫేమ్ వేణు శ్రీరామ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. దిల్ రాజు, బోనికపూర్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. అసలు ‘వకీల్ సాబ్’ ఈ మే లోనే రిలీజ్ కావాల్సింది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. తిరిగి ఈమధ్యనే షూటింగ్ ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ కూడా షూటింగ్ లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇప్పటికే పవన్ ఫస్ట్ లుక్ కు మంచి క్రేజ్ వచ్చింది. అయితే పవన్ అభిమానులు ఎప్పటి నుండో టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు.
దసరా సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేస్తారని అభిమానులు ఎంతో ఆశలు పెట్టుకున్నారు. కాని వారి కల నెరవేరలేదు. ఇప్పుడు దీపావళి కానుకగా టీజర్ రిలీజ్ చేస్తారని అందరూ భావించారు. కాని ఇప్పటి వరకు నిర్మాతలు టీజర్ రిలీజ్ కు సంబంధించి ఎలాంటి అప్టేడ్ ఇవ్వలేదు. దీంతో పవన్ ఫాన్స్ ఉసూరుమంటున్నారు. టీజర్ ద్వారానైనా పవన్ ని చూసుకుందామని అనుకుంటే ఆ ఆశ కూడా నిరాశే అయిందని తెగ ఫీలవుతున్నారు. టీజర్ పై దర్శకనిర్మాతలలో ఏ ఒక్కరూ స్పందించకపోవడం దారుణమైన విషయం అని అంటున్నారు అభిమానులు. మరి ఈ విషయంలో వకీల్ సాబ్ మేకర్స్ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.