ఎందరివో కష్టాలు తీర్చిన జేమ్స్ బాండ్ కూ కష్టాలూ తప్పలేదు. హాలీవుడ్ లో జేమ్స్ బాండ్ సిరీస్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఈ సిరీస్ లో తెరకెక్కిన 25 వ మూవీ ‘నో టైమ్ టు డై’. దీని అర్థం చావడానికి సమయం లేదు…. కానీ ఈ సినిమా విడుదల చేయడానికి మాత్రం సమయం రావడం లేదు. ఓ పక్క కరోనా మహమ్మారి జనాన్ని చంపేస్తుంటే ఇక ఈ జేమ్స్ బాండ్ మాత్రం ఏం చేస్తాడు. ధియేటర్లు ఓపెన్ అయ్యేదెప్పుడో, మన జేమ్స్ బాండ్ మనముందుకు వచ్చేదెప్పుడో మనకు అర్థం కావడం లేదు. ఈ సినిమా టీజర్ కూడా జనం ముందుకు ఎప్పుడో వచ్చేసింది. జేమ్స్ బాండ్ సినిమాల్లో సాగే మైండ్ గైమ్, యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా సాగుతాయో అందరికీ తెలుసు. ఇందులో కూడా అలాంటి ఉత్కంఠభరిత సన్నివేశాలు చాలానే ఉంటాయట. భారీ బడ్జెట్ తో ఈ సినిమ తెరకెక్కింది. హాలీవుడ్ నటుడు డేనియల్ క్రేగ్ జేమ్స్ బాండ్ గా ఎన్ని విన్యాసాలు చేస్తాడో చూడాలి. సినిమా కథ విషయానికి వస్తే ఓ శాస్ర్తవేత్తను రక్షించే మిషన్ ను సీఐఏ మన జేమ్స్ బాండ్ కు అప్పగిస్తుంది. ఈ ప్రయత్నంలో అతన్ని విలన్ అడ్డకుంటూ ఉంటాడు. ఈ సినిమాలో ఎలాంటి ఛేజింగ్స్ ఉంటాయో ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ఇందులో భయంకరమైన విలన్ గా ఆస్కార్ విజేత రామ్ మాలిక్ నటించాడు. క్యారీ జోజి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ లోనే విడుదల కావలసి ఉంది. కరోనా వల్ల ఇంకా విడుదలకు నోచుకోలేదు. ఈ సినిమాకి షూటింగ్ దశలో కూడా అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. సెట్‌లో నటుడు డేనియల్ క్రెయిగ్ గాయపడడంతో షూటింగ్ కొంత కాలం ఆగిపోయింది. ఆ తరువాత మరొకసారి సెట్‌లో అగ్నిప్రమాదం జరిగి పలు వస్తువులు కాలిపోయాయి. దీంతో రెండు సార్లు షూటింగ్‌కు ఆటంకం కలిగింది. ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకున్నా కరోనా ఈ సినిమా విడుదలను ఆపేసింది.
అవతార్ ఫ్రాంచైజీకి ఎందుకంత క్రేజ్?
అవతార్ - ద వే ఆఫ్ వాటర్... ఎవరి నోట విన్నా ఇదే...