మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా త్వరలో విడుదలకు రెడీ అవుతుంది. రెండు పాటల బ్యాలెన్స్ ఉంది. ఈ సినిమాతో పాటు చిరు.. మలయాళంలో విజయం సాధించిన లూసీఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి గాడ్ ఫాదర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. మెహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ముందుగా ఈ సినిమాకి సుకుమార్, సుజిత్, వినాయక్.. ఇలా కొంత మంది దర్శకులను అనుకున్నప్పటికీ ఫైనల్ గా ఆ బాధ్యతలను మోహన్ రాజా చేతిలో పెట్టారు. ఇటీవల ఈ సినిమా సెట్స్ పైకి వచ్చింది.
అయితే… ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడిందని తెలిసింది. అవును.. గాడ్ ఫాదర్ షూటింగ్ ఆగింది. కారణం ఏంటంటే.. ఇందులో కీలక మార్పులు చేర్పులు చేస్తున్నారట. మరో వైపు ఆచార్య కోసం చిరు, చరణ్ ల పై ప్రస్తుతం ఓ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ఇది వరకే గాడ్ ఫాదర్ స్క్రిప్టుని లాక్ చేసేశాడు చిరు కానీ.. మధ్యలో కొన్ని చిన్న చిన్న అనుమానాలూ, సందేహాలు మొదలవ్వడంతో కీలకమైన సీన్లు రీ రైట్ చేస్తున్నారని సమాచారం. అందుకే షూటింగ్ ఆగింది. చిరు ఆచార్య చిత్రాన్ని ఇంకా పూర్తి చేయాల్సివుంది. అది కూడా కంప్లీట్ చేసిన తర్వాత.. అప్పుడు గాడ్ ఫాదర్ రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఈలోగా టైమ్ ఉంది కాబట్టి మార్పులకు అవకాశం దక్కింది.
ఈ మూవీ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. సల్మాన్ ఖాన్ ని కాంటాక్ట్ చేయడం జరిగింది. అయితే.. ఈ సినిమాలో నటించే విషయమై ఇంకా సల్మాన్ ఏ నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే క్లారిటీ వస్తుంది అంటున్నారు చిత్రయూనిట్. గాడ్ ఫాదర్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ కు అనూహ్యమైన స్పందన వచ్చింది. మరి.. బాక్సాఫీస్ దగ్గర రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.
Must Read ;- చిరంజీవి, బాలయ్య.. త్రిష ఎవరికి ఓకే చెప్పనుంది..?