కరోనాకి ప్రపంచమే గడగడలాడుతోంది. కరోనా రాకుండా నిరోధించే వ్యాక్సిన్ కోసం అందరూ ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. చాలా దేశాల్లో కరోనా వ్యాక్సిన్ ప్రయోగాల దశలోనే ఉంది.
దాదాపు ఏడాది క్రితం కరోనా వైరస్ పుట్టినా ఇంతవరకు వ్యాక్సిన్ రాకపోవడంపై ఇంకా ఎన్నో అనుమానాలు ఉన్నాయి. తెలుగు హీరో నందమూరి బాలకృష్ణ ఈ మధ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనాకి అసలు వ్యాక్సిన్ రాదని తేల్చి చెప్పేశారు. బాలకృష్ణ మాటల్ని అంత తేలికగా తీసుకోడానికి వీలు లేదు. ఆయన ఆధ్వర్యంలో బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రి నడుస్తోంది. నిరంతరం వైద్యులతో ఆయన మాట్లాడుతూనే ఉంటారు. పైగా ఏదైనా తెలియని విషయం గురించి తెలుసుకోవాలనే తాపత్రయం ఆయనలో ఎక్కువ. ఆగిపోయిన తన ‘నర్తనశాల’ సినిమా భాగాన్ని విడుదల చేసిన సందర్భంగానూ ఆయన ఓ ఇంటర్వ్యూలో కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు.
Also Read:-అందరి డైలాగులతో అదరగొట్టిన ‘నర్తనశాల’ ట్రైలర్
కోవిడ్ అనేది ఆర్.ఎన్.ఎ.కి సంబంధించిన వైరస్ అని, దీనికి వ్యాక్సిన్ రాదని ఆయన వివరించారు. ఇది లిపిడ్ మాలిక్యులర్ ప్రొటీన్ అనీ, ఈ వైరస్ సోకకుండా జాగ్రత్త పడటం, రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం తప్ప వేరే మార్గాలు లేవని బాలకృష్ణ అభిప్రాయం. తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కూడా ఇదే విషయాన్ని అసెంబ్లీలో నొక్కి చెప్పారు. ఆర్ఎన్ఏ వైరస్ లకు ఇంతవరకు వ్యాక్సిన్ లు రాలేదని చెప్పారు. హెచ్ ఐ.వి. కూడా ఆర్.ఎన్.ఎ. జాతికి చెందిందే. ఆ విషయాన్ని అలా ఉంచితే దీని మీద వైద్య శాస్త్ర అధ్యయనాలు ఏం చెబుతున్నాయో కూడా చూద్దాం.
Also Read:-కరోనా టెస్టుల ధరలు తగ్గింపు
ఆర్.ఎన్.ఎ. అంటే ఏమిటి?
జీవ కణ వ్యవస్థకు సంబంధించిన పదాలే డీఎన్ఏ, ఆర్ఎన్ఏ అనేవి. ఆర్.ఎన్.ఎ.ని రైబో న్యూక్లిక్ యాసిడ్ అంటారు. ఆర్ఎన్.ఎ. వైరస్ లకు సింగిల్ న్యూక్లియో టైడ్స్ ఉంటాయి. దీని చుట్టూ రక్షణ కోసం ప్రొటీన్ సెల్ ఉంటుంది. దీనికి పూర్తిగా జీవం లేదని చెప్పలేం. అలాగని ఉందని కూడా చెప్పలేం. కణాన్ని కరోనా వైరస్ హైజాక్ చేస్తుంది. దాంతో ఆ కణం మన కోసం కాకుండా ఆ వైరస్ కోసం పనిచేయడం మొదలెడుతుంది. మనలోకి ఆ వైరస్ ప్రవేశించగానే మనకు తెలియకుండానే ఆ కణం వైరస్ సైన్యాన్ని తయారు చేస్తుంది.
రోబో సినిమాలో విలన్ రజినీలా అనుకోవచ్చన్నమాట. మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ లేకుంటే వైరస్ డామినేషన్ పెరిగిపోతుంది. వైరస్ పునరుత్పత్తి జరగాలంటే దానికి కూడా ఒక హోస్ట్ కావాలి. ఆ హోస్ట్ ఎవరో కాదు మన శరీరంలో ఉన్న కణమే. వైరస్ సైన్యంతో నిండిపోయిన ఆ కణం చివరికి బ్లాస్ట్ అయిపోతుంది. దాంతో అందులో ఉన్న వైరస్ లన్నీ మిగతా కణాలలోకి చేరతాయి. ఇలా ఒక్కో కణం లక్షల సంఖ్యలో వైరస్ లు తయారవుతాయి. వీటిని అరికట్టాలంటే రోగ నిరోధక వ్యవస్థను తయారుచేసుకోవాలసిందే తప్ప వేరే మార్గం లేదు. ఒక్క వైరస్ కొన్ని కోట్ల వైరస్ లను సృష్టించగలదు. అలా తయారైన వైరస్ లే ఎంతో మందిని పొట్టనబెట్టుకుంటున్నాయి. అసలు ఈ భూమ్మీద జీవం అనేది ఏర్పడటానికి ఆర్ఎన్ఏనే కారణం.
Also Read:-అనారోగ్యంతో బాధపడుతున్న కన్నడ బ్యూటీకి కరోనా పరీక్షలు
వ్యాక్సిన్ విషయానికి వస్తే..
కరోనా వ్యాక్సిన్ కోసం భారీ కంపెనీలు సైతం పోటీలు పడి వ్యాక్సిన్ తయారీలో ఉన్నాయి. ఇదిగో అదిగో అంటూనే ఏడాది అవుతోంది. ఇంకా ఈ వ్యవహారం కొలిక్కి రాలేదు. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ఆస్ట్రాజనికా పేరుతో ఓ వ్యాక్సిన్ ను తీసుకురాబోతోంది. ఇది ఏప్రిల్ వస్తుందని అంటున్నారు. భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ ప్రయోగాలు చివరి దశలో ఉన్నాయంటున్నారు. ఇక రష్యా వ్యాక్సిన్, ఫైజర్ టీకా, చైనా టీకా.. ఇలా రక రకాల మాటలు వినిపిస్తున్నాయి. నిజానికి ఇవన్నీ ఇంకా ప్రయోగాల దశలోనే ఉన్నాయి.
ఈ వ్యాక్సిన్ లు పెద్ద వయసు వారిలో అసలు పనిచేయవనే వాదన కూడా ఉంది. శత్రువు దాడి చేస్తున్నాడని తెలుస్తున్నపుడు దాన్ని ఎదుర్కోగలిగే సత్తా కూడా ఆ కణానికి ఉండాలి. కణాన్ని ఆ బలాన్ని టీకా ద్వారానే సాధ్యమవుతుందని శాస్ర్తవేత్తలు అంటున్నారు. ఇది కూడా నిజమని చెప్పలేం. ప్రయోగాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని మాత్రం ఆయా కంపెనీలు అంటున్నాయి. ఆక్స్ ఫర్డ్ టీకా వృద్ధులలో బలమైన రోగ నిరోధక వ్యవస్థ పెరుగుదలను సూచించిందని చెబుతున్నారు. ఇక రష్యా తయారుచేస్తున్న స్ఫుత్నిక్ వి వ్యాక్సిన్ 92 శాతం ఫలితాలను ఇస్తోందని చెబుతున్నారు.
ఈ టీకాలు ఇచ్చే రోగ నిరోధక శక్తి తాత్కాలికమా, దీర్ఘకాలికమా? అనే సందేహాలు కూడా ఉన్నాయి. చైనాలోని వ్యూహాన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ ప్రొడక్స్ట్, సినోఫార్మ్, రష్యా గమలేయ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ లాంటి సంస్థలు చేస్తున్న ప్రయోగాలన్నీ ఇంకా పరిశోధన దశలోనే ఉన్నాయి. వ్యాక్సిన్ వచ్చినా వృద్ధులలో తక్కువ ఫలితాన్ని మాత్రమే చూపిస్తుందని అంటున్నారు. ఇదంతా చూస్తుంటే వ్యాక్సిన్ కోసం ఎదురుచూడటం కన్నా రోగ నిరోధక వ్యవస్థను కాపాడుకోవడమే ఉత్తమం అనే అభిప్రాయం అందరిలోనూ కలుగుతోంది.
– హేమసుందర్ పామర్తి











