సోమవారం వచ్చిందంటే బిగ్ బాస్ హౌస్‌లో నామినేషన్స్ వేడి ఉండటంతో ఇంటి సభ్యులు అసలు రూపం బయటపడుతూ ఉంటుంది. వీళ్ల అసలు రంగు బయటకు లాగడం కోసం.. ప్రతివారం నామినేషన్స్ పెట్టి.. కొట్టుకుతిట్టుకు చచ్చేట్టు చేస్తారు బిగ్ బాస్. ప్రతివారం మాదిరే ఈవారం కూడా నామినేషన్స్ ప్రాసెస్ ఉండటంతో హౌస్‌లో స్టాంగ్ కంటెస్టెంట్లుగా చలామణి అవుతున్న నోయల్-లాస్యలు తిట్లదండకం అందుకున్నారు. కొట్టుకోవడం లేటు అన్నట్టుగా పెద్ద పెద్దగా అరుచుకుంటూ ఢీ అంటే ఢీ అంటున్నారు.
సోమవారం నాటి ఎపిసోడ్ ప్రోమో విడుదల చేయగా.. ఇందులో నోయల్ లాస్యలు హీట్ మీద ఉన్నారు. ఈ మధ్య బిగ్ బాస్ షో ప్రోమోల్లో ఉన్నంత మసాలా అసలు ఎపిసోడ్‌లో ఉండటం లేదు కాని.. ఈ ప్రోమో విషయానికి వస్తే.. వాళ్ల దగ్గర నా గురించి ఏదో అన్నావంట అంటూ నోయల్ నిలదీయడంతో ఫైర్ అయ్యింది లాస్య. ఫస్ట్ అడిగి చూడు.. ఎవరు చెప్పారో.. నేను చెప్పలేదు అంటూ గట్టిగా అరిచింది లాస్య. ఇక నోయల్ నేనేమన్నా తక్కువా అన్నట్టుగా.. ఎందుకు అరుస్తున్నావ్ నాకు అరవడం రాదనుకుంటున్నావా?? అంటూ బిగ్ బాస్ హౌస్ టాప్ లేపేస్తున్నాడు.
నీకే కాదు నాకూ అరవడం వచ్చు.. నీ వెనకాల మాట్లాడే అవసరం నాకు లేదు అని లాస్య చెలరేగిపోవడంతో, అయితే ముందు మాట్లాడినవాడ్ని పిలుస్తా అంటూ నోయల్ రచ్చ రేపాడు. ఏయ్ పిలువు.. ముందుకు తీస్కురా మాట్లాడదాం అంటూ వెనక్కి తగ్గనే తగ్గడం లేదు లాస్య.. మొత్తానికి ఈ ప్రోమో అయితే హీట్ మీదే ఉంది. కాని ఇదేదో ప్రోమో కోసమే కట్ చేసినట్టుగా ఉంది. టాస్క్‌లో భాగంగా సీరియస్ అవుతుంటే దాన్ని ప్రోమో కోసం వాడేసినట్టుగా కనిపిస్తోంది. ఈ ప్రోమోలో ఉన్న నోయల్-లాస్య ఢిష్యుం ఢిష్యుం నిజంగా ఎపిసోడ్‌లోఉందో, లేదో లేక ప్రోమో కోసం కట్ చేసారో తెలియాలంటే ఇంకొంత సమయం వేచి చూడాల్సిందే.
మొత్తం మీద బిగ్ బాస్ 4లో మసాలా లేదు అని అనుకుంటున్న సమయంలో నెమ్మది నెమ్మదిగా హౌస్ లో హీట్ పెరుగుతుంది. హౌస్ లో సభ్యులందరు సేఫ్ గేమ్ ఆడుతూ ఉండడం వలన మొదట్లో టీవీ ప్రేక్షకులు బిగ్ బాస్ 4పై నిరాశ పడ్డారు. రానురాను హౌస్ లో హీట్ పెరగడంతో ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతున్నారు. ఈ షో టీఆర్పీ రేటింగ్స్ కూడా బాగా పెరిగాయని సమర్పకులు తెలిపారు. ఈ షోలో అసలు మజా ముందు ముందు ఉంటుందని వారు తెలిపారు.











