“రంగ్ దే” నితిన్ కు 29 వ చిత్రం. వినోదాత్మక కుటుంబ చిత్రంగా దీనిని తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కాగా ఈ చిత్రంలో నితిన్ జోడీగా కీర్తిసురేష్ నటిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శుక్రవారం క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి సందర్భంగా చిత్ర బృందం ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ “రంగ్ దే” పోస్టర్లను, ఫోటోలను విడుదల చేసింది
ఈ ఫోటోలలో నితిన్, కీర్తిసురేష్ ఎంతో అందంతో మెరిసిపోతున్నాడు. ఈ విషయం ఇలావుంటే. మరోవైపు గాంధీ మెర్లపాక దర్శకత్వంలో అందుధాన్ రీమెక్ లోను, చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం “చెక్” సినిమాలోను , ఇంకా కృష్ణ చైతన్య దర్శకత్వంలోను వరుసపెట్టి నాన్ స్టాప్ గా నితిన్ సినిమాలు చేస్తున్నారు.
Must Read ;- పవన్ రావడం లేదు సరే.. అఖిల్, నితిన్ కి ఏమైంది.?