మరికొన్ని గంటల్లో ఎన్టీఆర్ బర్త్ డే రాబోతోంది. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి. బయట లాక్ డౌన్ నడుస్తోంది కాబట్టి, ఈ బర్త్ డేను సోషల్ మీడియాలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని తారక్ అభిమానులు ఫిక్స్ అయ్యారు. ఈ మేరకు వాళ్లంతా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు కూడా. కానీ ఎన్టీఆర్ మాత్రం ఈ బర్త్ డేను సెలబ్రేట్ చేసుకోవడం లేదు. ఎందుకంటే, ప్రస్తుతం అతడు కొవిడ్ బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. తన పుట్టినరోజును అభిమానుల సమక్షంలో జరుపుకోకపోయినా, ఫ్రెండ్స్ ను పిలిచి గ్రాండ్ గా పార్టీ ఇవ్వకపోయినా, కుటుంబ సభ్యుల మాత్రం కచ్చితంగా సెలబ్రేట్ చేసుకుంటాడు ఎన్టీఆర్.
ప్రతి బర్త్ డేకి కొడుకుతో కలిసి కేక్ కట్ చేయడం తారక్ కు అలవాటు. ఈసారి ఆ ఆనందం కూడా ఎన్టీఆర్ కు లేకుండా పోయింది. భార్యాపిల్లలకు దూరంగా ఐసొలేషన్ లో ఉంటున్నాడు యంగ్ టైగర్. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR చేస్తున్నాడు తారక్. ఈ మూవీ నుంచి ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ గా ఓ పోస్టర్ రెడీ అయింది. దాని కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. ఇక మైత్రీ మూవీ మేకర్స్ నుంచి కూడా ఓ కొత్త సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చేలా ఉంది.
అటు కొరటాల డైరక్షన్ లో చేయబోయే సినిమాకు సంబంధించి మరో కొత్త అప్ డేట్ ఇస్తారేమో చూడాలి. అయితే దీనికి సంబంధించి ఎన్టీఆర్ అప్ డేట్ కూడా ఇచ్చేశారు. ఎవ్వరూ తన పుట్టిన రోజు వేడుకలు జరపవద్దని ఆయన ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. అయినా అభిమానలు మాత్రం ఆయన పుట్టిన రోజు సన్నాహాల్లోనే ఉన్నారు. ట్రిపుల్ ఆర్ కు సంబంధించి రాజమౌళి ఎలాంటి అప్ డేట్ ఇస్తారన్న ఆసక్తి కూడా నెలకొని ఉంది.











