RRR Making Video :
బాహుబలి తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సంచలన చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ సినిమా గురించి మెగా అభిమానులు, నందమూరి అభిమానులే కాకుండా సినీ అభిమానులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, ఆయన జోడీగా అలియాభట్ నటిస్తోంది. ఇక కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తుండగా ఆయనకు జోడీగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమా రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతో ఈ రోజు నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేశారు. అందుకనే ఈ రోజు ఉదయం 11 గంటలకు రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ పేరిట ఈ సినిమా మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్, రాం చరణ్, అలియా భట్, ఒలివియ మోరీస్, అజయ్ దేవగణ్, శ్రియ లీడ్ రోల్స్ ప్లే చేసిన ఈ సినిమా మేకింగ్ వీడియోకు ఫ్యాన్స్ నుంచి భారీ రెస్పాన్స్ లభిస్తోంది. లుక్స్ పరంగా అల్లూరి సీతారామరాజు పాత్రకు తాను తప్ప మరో నటుడు సరిపోడేమో అన్నంతగా ఆకట్టుకున్నాడు రామ్ చరణ్. ఈ సినిమా కోసం మెగా పవర్ స్టార్ పడిన కష్టం కనిపించింది. ఇక రామ్ చరణ్ కు ధీటైన పాత్ర కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఆకట్టుకున్నాడు. ఈ పాత్ర కోసం ఎన్టీఆర్ చాలా హార్డ్ వర్క్ చేశారు. తనకు మాత్రమే సాధ్యమైన పాత్రను తలకెత్తుకున్నారు యంగ్ టైగర్.
RRR Making Video :
ఈ మేకింగ్ వీడియోలో ఎన్టీఆర్ ను చూస్తుంటే.. తెర పై ఎన్టీఆర్ మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించనున్నాడు అనిపిస్తుంది. ఆత్మ స్థైర్యం, కండబలం కలిగిన కొమరం భీమ్ పాత్రలో తారక్ నటనకు థియేటర్లు మోత మోగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మేకింగ్ వీడియోతో ఆర్ఆర్ఆర్ పై ఇప్పటి వరకు ఉన్న అంచనాలను రెట్టింపు చేశారని చెప్పచ్చు. అక్టోబర్ 13న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి.. మేకింగ్ వీడియోనే ఇలా ఉంటే.. ఇక సినిమా ఎలా ఉంటుందో..? ఇండియన్ స్క్రిన్ పై ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
Must Read ;- రాజమౌళి గురించి ఎవరికీ తెలియని నిజాలు











