రేణు దేశాయ్ కి మంచి ఫాలోయింగ్ ఉంది .. సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్స్ సంఖ్య చాలా ఎక్కువే. సోషల్ మీడియా ద్వారా ఆమె తన అభిమానులకు ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది. తనకి .. తన పిల్లలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. అలాగే సామాజిక బాధ్యతకు సంబంధించిన విషయాల పట్ల కూడా అందరిలో చైతన్యం తీసుకురావడానికి ఆమె తనవంతు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అలాంటి రేణు దేశాయ్ .. తాను ప్రేమలో పడినట్టుగా సోషల్ మీడియా ద్వారా చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది.
పవన్ కల్యాణ్ నుంచి విడిపోయిన రేణు దేశాయ్, అప్పటి నుంచి పిల్లల ఆలనాపాలన తానే చూస్తోంది. పిల్లలు కాస్త ఎదిగిన తరువాత, తన మనసును అర్థం చేసుకున్న వ్యక్తి తారసపడ్డాడని చెప్పింది. ఆ వ్యక్తిని తన జీవితంలోకి ఆహ్వానిస్తున్నట్టుగా స్పష్టం చేసింది. ఆయితే ఆమె రెండో పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం పట్ల కొంతమంది అసంతృప్తిని వ్యక్తం చేస్తే, మరికొంతమంది సమర్థించారు. ఆ తరువాత ఆ పెళ్లిని గురించి ఆమె ఎక్కడా ప్రస్తావించలేదు .. అభిమానులు కూడా ఆ విషయాన్ని గురించి అంతగా ఆలోచించలేదు.
Must Read ;- ఘనంగా సింగర్ సునీత పెళ్లి.. వీడియో రిలీజ్ చేసిన రేణుదేశాయ్
ఈ నేపథ్యంలో తాను ఈ అబ్బాయితో ప్రేమలో పడ్డానంటూ ఆమె సోషల్ మీడియా ద్వారా చెప్పడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. కొత్తగా ఈ అబ్బాయి ఎవరు? అనుకుంటూ అయోమయానికి లోనయ్యారు. చివరికి ఆమె ప్రేమలో పడింది కుక్కపిల్లతో అనే విషయం తేలింది. తాను ఎంతగానో ముచ్చటపడి పెంచుకుంటున్న ముద్దుల కుక్కపిల్లతో ఆమె దిగిన ఫోటోలు చూసిన తరువాతగానీ, అభిమానులకు ఒక క్లారిటీ రాలేదు. ఆ తరువాత ఆమె చిలిపితనానికి వాళ్లు కూడా సరదాగా నవ్వుకున్నారు. రేణు దేశాయ్ కి మూగజీవాలంటే ఎంతో ఇష్టమట. ఇలాంటి కుక్కపిల్లలు ఆమె దగ్గర చాలానే ఉన్నయని అంటున్నారు. మొత్తానికి రేణు దేశాయ్ తనదైన స్టైల్లో మరోసారి అభిమానులను కంగారు పెట్టేసింది.
Also Read ;- పవన్ ‘పోలెనా’ ఆ కళ్లు, ఆ నడక.. సేమ్ టు సేమ్