మాచర్లలో పిన్నెల్లి ఆగడాలకు అడ్డుకట్టపడింది!
ఏపీలో రానున్న ఎన్నికల్లో గుంటూరు జిల్లా, నరసరావుపేట పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికార వైసీపీ పరాజయం తప్పదన్నట్లు సంకేతాలు అందుతున్న వేళ.. దానిని తట్టుకోలేక టీడీపీ శ్రేణులపై అక్కసును వెల్లగక్కుతోంది. మాచర్ల నియోజకవర్గంలో అధికార వైసీపీ పనైపోయింది. ఇప్పటికే నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే పిన్నెల్లిపై ప్రజలతో పాటు పార్టీ శ్రేణులు కూడా గుర్రుగా ఉన్నారు. అభివృద్ధి మచ్చుకైన కనిపించక.. రెండు దశాబ్ధాలుగా పల్నాడు ప్రాంతం వెనకబడింది. అభివృద్ధిని పట్టించుకోవడం మాని.. నియోజకవర్గంలో అవినీతి పెచ్చురిల్లుతోంది. ప్రశ్నిస్తే.. అధికారపార్టీ అకృత్యాలు నెక్స్ట్ లెవల్ అన్న మాది కనిపిస్తోంది. నియోజకవర్గ పరిధిలోని దుర్గి మండల కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహం దాడికి యత్నించింది వైసీపీ. ఆ ఘటన మరువక మునిపే వెల్దుర్తి మండలంలోని గుండ్లపాడు తోట చంద్రయ్య ను వైసీపీ ఎంపీపీ కుటుంబ సభ్యులు దారుణంగా నరికి చంపారు. తాజా ఆదివారం మాచర్లలో బత్తుల రమణ అనే టీడీపీ కార్యకర్త వాహనాన్ని ధ్వంసం చేశారు. అర్ధరాత్రి అదును చూసుకుని కారు అద్దాలకు పగలు కొట్టారు. తెలుగుదేశం అని రాసి ఉన్న నేరానానికి ఇంత దారుణానికి వడికట్టాలా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాక మాచర్ల నియోజకవర్గానికి టీడీపీ ఇంఛార్జీగా జూలకంటి బ్రహ్మారెడ్డిని నియమించిన నాటి నుంచి పిన్నెల్లి రామకృష్టారెడ్డి ఓటిమి భయంతో రగిలిపోతున్నాడు. ఇదే అదునుగా టీడీపీ కేడర్ ను భయబ్రాంతులకు గురిచేయాలని వరుస దాడులకు పాల్పడుతున్నాడని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నరరావుపేటలో ..
గుంటూరు జిల్లా పరిథిలోని మరో నియోజకవర్గమైన నరసరావుపేటలో అధికార పార్టీ ఆగడాలకు అడ్డుఆపులేకుండా పోతోంది! నియోజకవర్గ పరిధిలో కేసానుపల్లిలో టీడీపీ ఫ్లెక్సీలకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనపై టీడీపీ ఇన్చార్జ్ చదలవాడ అరవిందబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలను పరిశీలించి వైసీపీ దుర్మార్గాలపై మండిపడ్డారు. ఫ్లెక్సీలను తగలబెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Must Read:-టీడీపీలో భారీ సంస్కరణలు.. ఆ దిశగా త్వరలో అడుగులు!