సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో మరిచిపోలేని సినిమాల్లో ఒక్కడు ముందుంటుంది. ఇంకా చెప్పాలంటే.. మహేష్ కి తొలిసారిగా బ్లాక్ బస్టర్ అందించిన సినిమా ఇది. గుణశేఖర్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా మహేష్ కి మాస్ లో తిరుగులేని ఇమేజ్ ని తీసుకువచ్చింది. ఈ మూవీని తమిళ్ రీమేక్ చేస్తే.. అక్కడ కూడా పెద్ద హిట్ అయ్యింది. అక్కడ విజయ్, త్రిష జంటగా నటించారు. గిల్లి టైటిల్ తో రూపొంది తమిళ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ఒక్క తమిళ్ లోనే కాదు.. కన్నడ, బెంగాలీ, హిందీల్లో రీమేక్ చేస్తే.. అక్కడ కూడా ఘన విజయం సాధించింది. ఇంతటి విజయాన్ని సాధించిన ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఎం.ఎస్.రాజు ఈ మూవీకి సీక్వెల్ చేయాలనుకుంటున్నారట. సీక్వెల్ స్టోరీ రెడీ చేసి మహేష్ కి వినిపిస్తాను. ఈ సినిమాతో సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ లో మళ్లీ వరుసగా సినిమాలు తీస్తాను అంటున్నారు. ప్లాన్ బాగానే ఉంది. మరి.. డైరెక్టర్ ఎవరు.? గుణశేఖర్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారు.
శాకుంతలం, హిరణ్యకశ్యప.. ఇలా వరుసగా ప్లాన్ ఇండియా మూవీస్ ప్లాన్ చేస్తున్నారు. ఇంత బిజీలో గుణశేఖర్ ఒక్కడు సీక్వెల్ చేయడానికి ఓకే చెబుతారా.? ఒకవేళ గుణశేఖర్ ఓకే అని చెప్పినా.. మహేష్ సినిమా చేయడానికి ఓకే చెబుతారా.? అనేది ప్రశ్న. ఎందుకంటే.. తెలుగులో సీక్వెల్ ఏవీ కూడా సక్సస్ సాధించలేదు. ఇది తెలిసి మహేష్ సీక్వెల్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా.? అయినా.. ప్రజెంట్ మహేష్ ని ఒప్పించడం అంటే మాటలు కాదు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ కే నో చెప్పేస్తున్నాడు. అలాంటిది ఒక్కడు సీక్వెల్ చేద్దామంటే… మహేష్ ఏం చెబుతారో.? ఏం జరగనుందో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Must Read ;- చరణ్ నో చెప్పిన స్టోరీకి మహేష్ ఓకే చెప్పాడా..?