డబ్బులు, లాభాలు తెచ్చిన ప్రతి సినిమా పెద్ద సినిమానే, ఈ లెక్కన చూస్తే టాలీవుడ్ లో సంవత్సరానికి లాభాలు తెచ్చే సినిమాలు 5 నుంచి 6 మాత్రమే ఉంటాయి. సినిమా హిట్ టాక్ వచ్చినా డబ్బులు రాకుండా పెట్టుబడి పెట్టిన వారికి నష్టాలు తెచ్చే సినిమాలే ఎక్కువ.
ఈ నేఫథ్యంలో భారీ బడ్జెట్ సినిమాలతో టాలీవుడ్ రేంజ్ పెంచేసిన నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వారు మళ్లీ తమ పాత స్ట్రాటజీతోనే సినిమాలు నిర్మించబోతున్నారు. యూవీ క్రియేషన్స్ పెట్టిన కొత్తలో శర్వానంద్ హీరోగా రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా వంటి సినిమాలు తీసి లాభాలు ఆర్జించారు యూవీ క్రియేషన్స్ అధినేతలు.
అలానే గీతా 2 పిక్చర్స్ తో కలిసి భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా వంటి లో బడ్జెట్ సినిమాలు తీసి బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. అయితే యూవీని కోలుకోలేని దెబ్బ తీసిన సినిమా సాహో. ఈ భారీ బడ్జెట్ సినిమాతో యూవీ వారు ఏకంగా 250 కోట్లు నష్టపోయారు.
అయితే సాహో టైమ్ లో మొదలుపెట్టిన రాథేశ్యామ్ కి కూడా బాగానే ఖర్చు అవుతోంది. ఈ సినిమా తరువాత ఇక యూవీ నిర్మాతలు ఇప్పుడప్పుడే పెద్ద సినిమాలకి వెళ్లకూడదని ఫిక్స్ అయినట్లుగా సమాచారం. అంతేకాదు మనసానమః అనే షార్ట్ ఫిల్మ్ తీసిన దీపక్ డైరెక్టర్ తో యూవీ క్రియేషన్స్ వారు సినిమా చేస్తున్నారు. లో బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది.
సో.. పాయింట్ ఏంటంటే.. సొంత బ్యానర్ అయినప్పటికీ.. యువీ క్రియేషన్స్ నుంచి.. ఇప్పట్లో ప్రభాస్ తో మళ్లీ సినిమా ఉండకపోవచ్చు.











