టాలీవుడ్ స్టార్ హీరోలు.. వైవిధ్యమైన సినిమాలు చేయాలనుకుంటున్నారు.. చేస్తున్నారు. వాళ్లతో సినిమాలు చేయడానికి డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ రెడీగా ఉన్నారు. మన హీరోలు కెరీర్ లో ఎలాంటి గ్యాప్ రాకుండా ఉండేందుకు ఒక సినిమా సెట్స్ పై ఉండగానే.. మరో సినిమా సెట్ చేసుకుంటున్నారు. కొంత మంది హీరోలు అయితే.. రెండు మూడు సినిమాలు ఓకే చేసుకుని వరుసగా సినిమా చేస్తున్నారు. అయితే.. ఎంతలా ప్లాన్ చేసినా మన హీరోలకు విలన్ కష్టాలు తప్పడం లేదు. అదేంటి విలన్ కష్టాలు ఏంటి అనుకుంటున్నారా..? విషయం ఏంటంటే..?
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా తర్వాత వేదాళం రీమేక్ చేయనున్నారు. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్నారు. ఆల్రెడీ స్ర్కిప్టె రెడీ చేసి షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు డైరెక్టర్ మెహర్ రమేష్. కొత్త సంవత్సరంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే.. ఈ సినిమాలో చిరు చెల్లెలుగా కీర్తి సురేష్ ఫిక్స్ అయ్యింది కానీ.. విలన్ ఎవరు అనేది ఖరారు కాలేదు. చిరుకు తగ్గట్టుగా ఉండే పవర్ ఫుల్ విలన్ రోల్ కోసం బాలీవుడ్ విలన్ ని రంగంలోకి దింపాలి అనుకుంటున్నారని తెలిసింది.
నందమూరి నటసింహం బాలయ్య.. బోయపాటి డైరెక్షన్ లో మూవీ చేస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ మూవీ స్టార్ట్ అయి చాలా రోజులు అయ్యింది కానీ.. విలన్ ఎవరు అనేది ఇంకా ప్రకటించలేదు. బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి పేరు వినిపిస్తుంది. త్వరలోనే విలన్ ని కన్ ఫర్మ్ చేయనున్నట్టు సమాచారం. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ కీర్తి సురేష్. మిగతా తారాగణం అంతా సెట్ అయ్యారు కానీ.. విలన్ మాత్రం ఇంకా సెట్ కాలేదు.
Also Read ;- విజయ్ దేవరకొండ సుకుమార్ మూవీ స్టోరీ ఇదేనా..?
పరశురామ్ కూడా మహేష్ కోసం బాలీవుడ్ నుంచి విలన్ ని రంగంలోకి దింపనున్నారని వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ హీరో అనిల్ కఫూర్ పేరు వినిపిస్తోంది. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతానికి ఆగింది. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది కానీ.. విలన్ ఎవరు అనేది ఇంకా ఖరారు కాలేదు. ఈ మూవీ కోసం కూడా విలన్ బాలీవుడ్ నుంచి రానున్నట్టు సమాచారం. ఇలా.. టాలీవుడ్ హీరోల కోసం బాలీవుడ్ నుంచి విలన్లు రావాల్సివస్తుంది. ఈవిధంగా మన హీరోలకు విలన్ కష్టాలు తప్పడం లేదు. మరి.. భవిష్యత్ లో అయినా.. మన హీరోలకు విలన్ కష్టాలు తప్పుతాయని ఆశిద్దాం.
Must Read ;- పొలిటికల్ లీడర్ గా అల్లు అర్జున్?











