వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో అన్ని వర్గాలకూ ఏదో రూపంలో హామీలు ఇచ్చి.. ఆ దేవుని దయ వల్ల అధికారంలోకి రాగానే చేస్తాను అని హామీ ఇచ్చి.. ఇప్పుడు ఒకొక్కరికీ హ్యాండిచ్చే సంస్కృతికి తెర తీశారు. నేను విన్నాను, నేను ఉన్నాను.. అంటూ నమ్మపలికిన జగన్.. అధికారంలోకి వచ్చాక ప్రతి అవ్వకు, తాతకు మూడు వేల పింఛను ఇస్తానని చెప్పారు. అధికారంలోకి వచ్చాక అవ్వా, తాతకు ఇచ్చే పింఛను ఏడాదికి రూ.250 పెంచుకుంటుపోతా మూడు వేల చేస్తానని మాట మార్చారు. ఇప్పుడు ఏకంగా ఒక రేషన్ కార్డ్ కు ఒక పింఛన్ అంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నాడు.
ఒక రేషన్ కార్డుకు ఒకటే పింఛన్
ఒక రేషన్ కార్డుకు ఒకటే పింఛను విధానాన్ని ఎపీలో వైసీపీ ప్రభుత్వం మళ్ళీ తెరపైకి తెచ్చింది. గత ఏడాది మే నెలలో ఒక రేషన్ కార్డుకు ఒకే పింఛన్ అనే విధానాన్ని అమలు చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తే లబ్ధిదారుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఫలితంగా నాడు ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. అయితే తాజా గా ఒక రేషన్ కార్డు కు ఒకే పింఛన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయుంచింది. ఒక కుటుంబంలో రెండు పింఛన్లు ఉంటే ఒక పింఛనును రద్దు చేయనుంది. దివ్యంగ, అభయహస్తం, కిడ్నీ, తదితర పింఛన్లను మినహాయింపు ఇచ్చారు. ఈ మేరకు ఒక రేషన్ కార్డు మీద రెండు పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులకు వాలంటీర్ల ద్వారా నోటీసులు పంపింది. కడప, నెల్లూరు, విజయనగరం జిల్లాలో నోటీసులు జారీ అయ్యాయి.
7 రోజులు దాటితే శాశ్వత రద్దు
2019 డిసెంబర్ 13 న జారీచేసిన ఉత్తర్వు 174 ప్రకారం మీ పింఛను సంఖ్యను నమోదు చేసి మీ కుటుంబ, వ్యక్తిగత వివరాలను తెలుసుకొని మీ కుటుంబంలో రెండు పింఛన్ పొదుతున్నట్లు తెలుసుకున్నాము. మీ కుటుంబంలో ఏ పింఛను కొనసాగించాలో 7 రోజుల లోపల మండల కార్యాలయంలో తెలపాలి. పింఛను అర్హతకు తగు ఆధారాలు సమర్పించకపోతే శాశ్వతంగా రద్దు చేస్తాం అని నోటీసులలో పేర్కొన్నారు. వెరసి నోటీసులకు స్పందించేందుకు వారం మాత్రమే గడువు ఇచ్చిన జగన్ సర్కారు.. ఆ వ్యవధిలోగా స్పందించకుంటే.. తన ఇష్టం వచ్చినట్టుగా పింఛన్లను రద్దు చేసే యోచనలో ఉన్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇలా రద్దయ్యే పింఛన్లలో అర్హత కలిగినవి ఉన్నా.. వాటిని పునరుద్ధరించే దిశగా జగన్ సర్కారు చర్యలు చేపట్టే అవకాశాలూ లేవన్న వాదనలు వినిపిస్తున్నాయి.
పేద ప్రజల పొట్ట కొట్టడమే
ఆనాడు అవ్వా, తాత అంటూ ఆప్యాయంగా పిలిచి, వారి బాధ్యత నాది అంటూ చెప్పిన జగన్.. ఈరోజు వారికి ఇచ్చే రూ.3 వేలు ఇవ్వకపోగా, ఒక రేషన్ కార్డుకు ఒక పింఛన్ అని అవ్వా, తాతలకు, వితంతులను మోసం చేసేందుకు జగన్ సర్కారు సిద్ధమైపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇలా పేదలకు ఆసరాగా ఉన్న పథకాలలో ఏ ప్రభుత్వం ఇలా కోత పెట్ట లేదని, ఇలా చేయడం పేద ప్రజలను మోసం చేయడమే అన్న వాదనలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. ఈ దిశగా సర్కారు వెనకడుగు వేస్తే సరేసరి.. లేదంటే విపక్షాలకు బదులుగా నేరుగా పేద ప్రజలు, ప్రభుత్వ పథకాల లబ్దిదారులే రోడ్డెక్కి మరీ జగన్ సర్కారుకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
Must Read ;- జగన్ అండ్ కోకు మరింత ముప్పు