మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువ ఉంటే రేట్ ఎక్కువ పెరుగుతుంది.. బాహుబలి సినిమాకి భారీ డిమాండ్ ఉండడంతో అమెరికాలో టికెట్‌కి భారీగా వసూళ్లు చేశారు. అయినా ఆడియెన్స్ ఎగబడి చూశారు.. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ట్రిపుల్ ఆర్ మూవీదీ సేమ్ సేన్. టికెట్ రేట్లు పెంచినా డాలర్లు పెట్టి మరీ టికెట్లు కొని సినిమా చూశారు ప్రేక్షకులు.. ఇక, సలార్‌తోపాటు బడా హీరోల సినిమాలదీ సేమ్ సీన్.
ఇదంతా ఎందుకంటే.. డిమాండ్ ఉంటే రేటు ఎక్కువగా ఉంటుందనేది సామెత… తాజాగా ఏపీ ఎన్నికలలో పార్టీ టికెట్ల అంశంలో మరోసారి ఇదే మార్కెట్ రూల్ అప్లై అక్షరాలా అప్లై అయిందని ప్రచారం జరుగుతోంది. చెన్నైలో స్థిరపడిన ఓ బడా పారిశ్రామిక వేత్తకి వైసీపీ అగ్రనేతలు ఫోన్‌ల మీద ఫోన్‌లు చేశారట.. మొదట ఫోన్ చేసి.. ఆయనకు ఒంగోలు లేదా నెల్లూరు పార్లమెంట్ టికెట్ ఇస్తామని, పోటీ చేస్తారా అని ఆరా తీశారట. దీనికోసం పార్టీ ఖర్చుల కోసం రూ. 140 కోట్లు చెల్లించాలని కోరారట.. లోక్ సభ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌కి 20 కోట్లు ఖర్చు పెట్టుకోవాలని, ఏడు సెగ్మెంట్‌లకి కలిపి రూ. 140 కోట్లు ఇవ్వాలని కోరారట..
వైసీపీ ఆఫర్ పై ఆ బడా పారిశ్రామిక వేత్త ఆలోచించుకునేలోపే తాడేపల్లి ప్యాలెస్ నుండి మరోసారి ఫోన్ వచ్చిందట.. ఈ సారి 140 కోట్లు అవసరం లేదని, 120 కోట్లు చాలని సూచించారట.. ఆయన వెంటనే గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకోవడానికి తన టీమ్‌ని నియమించుకున్నారట.. ఆయన మౌనాన్ని వేరే సంకేతంగా భావించిన వైసీపీ హై కమాండ్ ఫోన్‌ల మీద ఫోన్‌లు చేసి 100 నుండి చివరికి 60 కోట్లకు తగ్గిందట.. ఆ మాత్రం చెల్లించినా తాము టికెట్ ఇవ్వగలమని ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది..
ఆ పారిశ్రామిక వేత్త… వైసీపీ నేతల కంగారుపై ఆరా తీయగా, అక్కడ పరిస్థితులు వేరేగా ఉన్నాయని ఓడిపోవడం ఖాయమని ఆయన సర్వేలలో తేలిందట.. ఇదే టైమ్‌లో తాడేపల్లి ప్యాలెస్ నుండి ఫైనల్‌గా 30 కోట్లు ఇచ్చినా చాలని గోల్డెన్ చాన్స్ ఇచ్చారట.. దీంతో, ఆయన వెంటనే సారీ, తాను పోటీ చేయలేనని, వచ్చే ఎన్నికలలో చూద్దామని, తనకు ప్రస్తుతానికి రాజకీయాలంటే ఇష్టం లేదని తప్పించుకున్నారని సమాచారం.. దీంతో, ఈ రెండు నియోజకవర్గాలలో పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఫైనల్‌గా ఒంగోలు నుండి బరిలో జగన్ సన్నిహితుడు, ఆ పార్టీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నెల్లూరు నుండి రేసులోకి దింపారు.. ఇటు నెల్లూరు ఎంపీ స్థానానికి వైసీపీ అగ్రనేత విజయ సాయి రెడ్డిని రంగంలోకి దింపారు జగన్.
మొత్తమ్మీద, వైసీపీకి ఈ ఎన్నికలు ఎలాంటి చుక్కలు చూపించబోతున్నాయో, ఎలాంటి చిక్కులు సృష్టించబోతున్నాయో క్లియర్‌గా అర్ధం అవుతోంది.. మరి, ఈ పరిస్థితిని జగన్ ఎలా చక్కదిద్దుకుంటాడో చూడాలి..