May 14, 2026 10:58 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ఆ బొకడా సినిమానా?

ఈ కరోనా కాలంలో చిన్న సినిమా చింతలేని సినిమా అనుకోవాలేమో. నిన్నకాక మొన్న ‘కలర్ ఫొటో’ సినిమా గురించే అందరూ మాట్లాడుకున్నారు.. ఈ రోజు ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. పెద్ద సినిమాలు చిన్న బోతుంటే చిన్న సినిమా సినీ పరిశ్రమకు కొత్త సొబగులు తెస్తోంది.

November 25, 2020 at 10:37 PM
in Cinema, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

 ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ గురించి ఈ రచయిత స్పందన చూడండి.. సినిమా చూడాలో వద్దో మీకే తెలుస్తుంది. దీన్ని ఆయన మాటల్లోనే ఆస్వాదించండి..

సినిమా తరువాత సినిమా.. చూస్తూ చూస్తూ తెలుగు సినిమా అంటేనే విరక్తీ, వైరాగ్యం వచ్చి చచ్చాయి నాకు. బొకడా సినిమాలూ, బోకు కథలూ, కుప్పిగంతులూ, పిచ్చికూతలూ, మరీ కాకపోతే కొన్ని కాపీ సీన్లకు ప్రాస డైలాగుల్ని వరుసలు పేర్చి, ఆ చెత్తంతా తెలుగు ప్రేక్షకుల నెత్తిన రుద్దుతున్నారని తిక్కదొబ్బుతోంది నాకు. తెలుగు సినిమాని ఎదగనివ్వకుండా తమ దొడ్లలో గొడ్డుని కట్టేసినట్లు కట్టేసుక్కూచున్న కాంపౌండు హీరోల మీద అసలే మంట మీదుంటే, మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమా అమెజాన్ ప్రైమ్ లో వచ్చిందని తెలిసింది.

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరో అనేసరికి ఒళ్లు మరింత మండుకొచ్చింది. వీడొక కొత్త కాంపౌండు హీరోగాడు తయారయ్యాడన్న మాట అనుకుంటూ, ట్రైలర్ కూడా సగంలో ఆపేసుక్కూచున్నాను.
సినిమా ప్రిజమ్ నిండా నెపోటిజమ్ తప్ప మరేమీ లేదన్న నైరాశ్యం ఆవహించి, అసలు సినిమాలు చూడనవసరం లేదని, దండగని అనుకున్నా, ఇప్పుడు ఓటీటీ ని కూడా ఈ నెపోటిజమ్ గాళ్లు వదిలి పెట్టడం లేదని తెలిసే సరికి కోపం నషాళానికంటింది. కానీ, ఇంట్లో తప్పలేదు. పిల్లలకు ఎంటర్ టైన్మెంట్ తప్ప మిగతా ఆలోచనలు అనవసరం.

కాసేపు టైమ్ పాస్.. అది ఎవడు చేస్తేనేమీ? అలాంటి పరిస్థితుల్లో చూడాల్సి వచ్చింది.. అమెజాన్ ప్రైమ్ లో.. మిడిల్ క్లాస్ మెలోడీస్.. అనే సినిమాని. ఒక షాటూ, రెండు షాట్లూ.. ఒక్కొక్క పాత్ర ప్రవేశిస్తోంది. మెల్లగా ఆ పాత్రల్లో నాదొక ప్రేక్షక పాత్రయిపోతోంది. అప్పుడనుకున్నాను.. ఎవడ్రా ఈ సినిమా తీసిందీ అని. పల్లెటూళ్లో హోటల్ యజమాని. అతని భార్య. వాళ్ల కొడుకు. వాడికో ఫ్రెండు. ఆ ఇంటికి పాలు పోసే వాడు. ఆ హోటల్ యజమానికో సిటీలో చుట్టం. వాడికో కూతురు. ఈ కొడుక్కీ, ఆ అమ్మాయికీ చిన్న ప్రేమకథ. మధ్యలో ఆ ఫ్రెండుగాడికో లవ్ స్టోరీ.. వాడికో చిన్న సెల్ ఫోన్ వ్యాపారం. దానికి తోడు జాతకాల పిచ్చ. ఆ ఫ్రెండుకో పెదనాన్న.

ఆయనకు ఊళ్లో బోలెడంత గౌరవం. అందుకని, ఆ ఊరిలో చాలామంది ఆయన దగ్గర చిట్టీలు వేయడం, తీరా ఆ పెద్దమనిషికో కష్టం వచ్చి, ఆయన కనిపించకుండా పోవడం, చిట్టీలు కట్టి డబ్బులు ఇరుక్కుపోయి ఊళ్లో చాలా జీవితాలు అతలాకుతలం అయిపోవడం, దాని వల్ల ఆ హోటల్ యజమాని కొడుకు గుంటూరులో హోటల్ పెట్టాలన్న కల చెదిరిపోవడం, దానికి అతని ప్రేమ ముడిపడిపోవడం.. ఇలా అల్లిక మీద అల్లిక… గుక్క తిప్పుకోకుండా కథని మలుపు మీద మలుపు తిప్పి, ప్రేక్షకుడినైన నన్ను కట్టిపడేసిందా సినిమా.

సినిమాలో సీను సీనూ.. జీవం పోసుకుంటూంటే, పాత్ర పాత్రకీ ఆ నటులు ప్రాణం పోసేస్తుంటే.. చూస్తూ తన్మయులం అయిపోవడం తప్ప ఇంకేమీ చేయలేకుండా ఉండిపోతాం. ఎక్కడి నుండి పుట్టారీ నటీనటులంతా? అని గొప్ప ఆశ్చర్యం కలిగింది నాకు. ఇంతకాలం తెలుగు సినిమా తెర మీద ఇలాంటి వాళ్లు ఎందుకు కనిపించలేదు అన్న కోపం వెంటనే, కనీసం ఓటీటీ పుణ్యమా అని ఇప్పటికయినా వీళ్లు మన కళ్లకు సాక్షాత్కరిస్తున్నారని ఆనందం ఉప్పొంగింది. నటులా వాళ్లు.. జీవించేశారు. సంధ్యగా పాత్ర పోషించిన తెలుగమ్మాయి.. ఎవరో వర్ష బొల్లమ్మ అంట.. సెకనుకు 24 ఫ్రేములుండే సినిమా నిడివిలో, సెకను సెకనుకీ కాదు, ఫ్రేము ఫ్రేముకీ నటించి మెప్పించింది.

సంధ్య అనే పాత్రకు ఆ అమ్మాయి ప్రాణం పోస్తుంటే, అది చూస్తున్న ప్రేక్షకుడిగా నాకు ప్రాణం లేచొచ్చింది. పల్లెటూరు హోటల్ యజమానిగా గోపరాజు రమణ గారు.. తండ్రి పాత్రని సాక్షాత్కరింపజేశారు. ఒక్క షాటులో కూడా ఎక్సప్రెషన్ లేకుండా ఆయన లేరు. ఆయన డైలాగ్ ఉన్నా లేకపోయినా, చిన్న కనురెప్ప కదలికలోనూ ఆయన నటించేసి మెప్పించేశారు. మహానుభావుడు.. ఇన్నాళ్లూ తెలుగు వెండితెర ఆయనని విస్మరించినందుకు సిగ్గుతో చావాలి. ఆయన భార్యగా నటించినావిడ.. అంటే ఆనంద్ దేవరకొండ అమ్మ పాత్రధారి.. కాళ్ళకి నమస్కారం పెట్టాలనిపించింది.

Must Read: ఫుడ్ మనది.. బిల్లు ‘దేవరకొండ’ బ్రదర్స్ ది

ఆనంద్ దేవరకొండ ఫ్రెండు గోపాల్ పాత్రధారి, ఓ సెల్ ఫోన్ షాపులో సెల్సుగర్లు కమ్ గోపాల్ గర్ల్ ఫ్రెండ్ అయిన ఆ చిట్టితల్లి, అదే సెల్ ఫోన్ షాపులో ఆ చిట్టితల్లి తోటి సేల్స్ గర్ల్ స్నేహితురాలు.. ఆఖరికి పాలు పోసే ముసలాయన, ఆటోడ్రైవరు, సెల్ ఫోన్ సేల్సుగర్ల్ తాగుబోతు తండ్రి.. ఆఖరుకి.. ఆ సినిమాలో మామిడి చెట్టు కూడా అద్భుతంగా నటించేసింది. ఏంట్రా ఈ సినిమా అని ఆశ్చర్యపోతూ, టైటిల్సు పడినప్పుడు, అసలు ఎవడ్రా ఈ డైరెక్టరు అని చూసేసరికి, వినోద్ అనంతోజు డైరెక్షన్ అనే కార్డు చూసి దిమ్మతిరిగి షాక్ అయిపోయాను. ఎప్పుడో ఆరేడేళ్ల కిందట… అతని రెండు మూడు షార్టు ఫిల్ములు చూసి, వీడు మామూలోడు కాడు.. అని అప్పుడే అనుకున్నాను.

శూన్యం, మరణం అనే రెండు షార్టు ఫిల్ములు తీసి, శభాష్ అని అప్పట్లోనే అనిపించుకున్న చిచ్చరపిడుగు వినోద్ అనంతోజు. అతడు ఆ తరువాత సోదిలో లేకుండా పోయేసరికి ఆ పేరే మర్చిపోయాను. మళ్లా ఈ సినిమా చూసేసరికి, ఆ వినోద్ అనంతోజు ఈలోగా ఇంత పెద్ద వాడయిపోయాడా అని ఆశ్చర్యపోయాను. మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా చూశాక.. ఆనంద్ దేవరకొండ మీద కోపం పోయింది. ఇలాంటి సినిమాలు అడపాదడపా చేయాలని ఆశీర్వదించాలనిపించింది. వినోద్ అనంతోజు మొదటి సినిమానే అద్భుతంగా మలిచాడు.

ఇలాంటి అద్భుతాలు అతను ఇంకా ఇంకా చేస్తాడు, నేను చూస్తాను. సందేహమే లేదు. మంచి కెమెరా, అంతకుమించి బ్యాక్ గ్రౌండ్ సంగీతం, అవసరానికి సరిపడిన పాటలు.. వెరసి అందరూ కలిసి ఓ అద్భుతాన్ని అమేజాన్ ప్రైమ్ లో ఆవిష్కరించేశారు. మిడిల్ క్లాస్ మెలోడీస్ కథ పరిగెడుతూనే ఉంటుంది, కానీ అక్కడక్కడే తిరుగుతున్నట్లుంటుంది. కథ ముగినట్లే ఉంటుంది, కానీ మళ్లీ మొదలుతో మొలకెత్తుతుంటుంది. ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు చూస్తే తరిస్తారు. లేదంటే, ఎప్పటిలాంటి చెత్తనే నెత్తిమీద జల్లుకుంటూ బతుకులు చాలిస్తారు. మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా చూడని వాళ్లకి ఇదే నా శాపం.
– సతీశ్

Also Read: మిడిల్ క్లాస్ మెలోడీస్;లో గుండె తలుపు తడుతున్న గుంటూరు పాట

Tags: anand devarakondalatest tollywood celebrity newsmiddle class melodiesmiddle class trendtelugu newsTollywood latest newsTollywood moviestollywood news
Previous Post

మేనిఫెస్టోలు  ఓట్లు రాలుస్తాయా..?

Next Post

ఫుడ్ మనది.. బిల్లు ‘దేవరకొండ’ బ్రదర్స్ ది

Related Posts

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

Catherine Tresa Alexander

షూటింగ్ పూర్తి చేసుకున్న విశాల్ ‘చక్ర’ సినిమా

మంచు విష్ణుని టార్గెట్ చేసిన ఏసీపీ సునీల్ శెట్టి

ఉత్కంఠను రేకెత్తిస్తున్న ‘మీర్జాపూర్’ సీజన్ 2 

ముఖ్య కథనాలు

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist