ఆస్కార్ అవార్డుల ఉత్కంఠకు మరో నాలుగు రోజుల్లో తెరపడనుంది. మన భారతదేశం నుంచి దాదాపు 10 చిత్రాలు ఈ అవార్డు కోసం పోటీ పడుతున్నాయి. మన తెలుగు నుంచి ట్రిపుల్ ఆర్ కూడా బరిలో ఉంది. ఛల్లో షో అనే గుజరాతీ సినిమా, కాశ్మీరీ ఫైల్స్, కాంతార లాంటి సినిమాలు ఈ అవార్డు కోసం పోటీ పడ్డాయి. ఈ నెల 24న ఆస్కార్ విజేతలను ప్రకటించనున్నారు. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడంతో అందరిలోనూ ఆస్కార్ ఉత్కంఠ నెలకొంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో ట్రిపుల్ ఆర్ దాదాపు ఆస్కార్ దరిదాపుల్లోకి వచ్చేసిందని అనుకోవచ్చు. ఆస్కార్ అవార్డుల ఎంపికలో అత్యంత కీలక ఘట్టమైన ఓటింగ్ ఘట్టం పూర్తయ్యింది. గత 95 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో ఎప్పుడూ జరగనంత స్థాయిలో 80 దేశాలకు చెందిన అకాడమీ సభ్యులు ఓటింగులో పాల్గొన్నారు. ఇంతమంది ఓటింగులో పాల్గొనడం ఇదే మొదటిసారని చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా 300 సినిమాలు ఈ అవార్డు కోసం పోటీ పడుతున్నాయి. వీటిలో మన ఇండియా నుంచి 10 సినిమాలు ఉన్నాయి.
ఓటింగ్ ప్రక్రియ పూర్తి
ఓటింగ్ శాతంపై ఖచ్చితమైన గణాంకాలను అకాడమీ షేర్ చేయలేదు. కానీ 18 బ్రాంచ్‌లలో 9,579 మంది ఓటింగ్ చేసినట్టు సమాచారం. ఎక్కువ మంది ఓటింగులో పాల్గొనడం వల్ల ఊహించని ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా అవతార్: ది వే ఆఫ్ వాటర్, గ్లాస్ ఆనియన్ , టాప్ గన్: మావెరిక్ లాంటి అనేక బ్లాక్‌బస్టర్‌ల గురించి చర్చలు నడుస్తున్నాయి. ఆస్కార్ ఉత్తమ చిత్రాల కేటగిరీ అనేది చాలా కీలకమైన ఘట్టం. పైన పేర్కొన్న సినిమాలే కాకుండా మార్వెల్ వారి బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్తో సహా నాలుగు సీక్వెల్స్ లను కూడా గుర్తించారు. ఆస్కార్ చరిత్రలో కేవలం ఎనిమిది సీక్వెల్స్ మాత్రమే ఇప్పటిదాకా నామినేట్ అయ్యాయి. కోలిన్ ఫారెల్ (“ది బాన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్”), బ్రెండన్ ఫ్రేజర్ (“ది వేల్”), ఏంజెలా బాసెట్ (“బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్”), మిచెల్ యో, కె హుయ్ క్వాన్ , లేడీ గాగా, సెలీనా గోమెజ్, రిహన్న, టేలర్ స్విఫ్ట్, డ్రేక్ , వీకెండ్ లాంటి సినిమాలు ఈసారి బరిలో ఉన్నాయి. ఈ అవార్డుల విజేతలను ఈనెల 24న శామ్యూల్ గోల్డ్‌విన్ థియేటర్ నుంచి ప్రకటిస్తారు. లైవ్ ప్రసారాలు ఉంటాయి. మొత్తం 23 విభాగాల్లో ఈ అవార్డుకు ఉన్న సినిమాలను ప్రకటిస్తారు.
మన ఆర్ఆర్ఆర్ కు పోటీ ఎవరో తెలుసా?
అయితే తెలుసుకుందాం. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగాంలో మన ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ ఉంది. దీంతో పాటు బ్లాక్ పాంథర్ – వకాండా ఫరెవర్ లోని లిఫ్ట్ మి అప్ పాట పోటీ పడుతోంది. అలాగే టాప్ గన్ – మావరిక్ లోని హోల్డ్ మై హ్యాండ్ , టెల్ ఇట్ లైక్ ఎ ఉమన్ లోని అప్లాస్, గిల్లెర్మో డెల్ టోరో పినోచియోలోని ఓ పాట పోటీ పడుతున్నాయి. విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.